పదోన్నతిపై నెల్లూరు బదిలీఅయిన టెక్కెకెనరాబ్యాంకు మేనేజర్ ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించిన ఖాతాదారులు,అదికారులు

నంద్యాలజూలై9(ప్రజాన్యూస్):నంద్యాలపట్టణంలోని  టెక్కె కెనరాబ్యాంకు ఎన్జిఓకాలనీ బ్రాంచ్ మేనేజర్లు ప్రసాదరెడ్డి కళాదర్ పదోన్నతిపై బదిలీ అయిన సందర్బంగా పట్టణంలోని టెక్కె కెనెరాబ్యాంకులో వీడ్కోలు సమావేశం జరిగింది..ఈకార్యక్రమానికి కెనెరాబ్యాంకు చీప్ మేనేజర్ మల్లేశ్వరరావు ముఖ్య అతిదిగా హాజరుకాగా బ్యాంకు ఖాతాదారులు హాజరయ్యారు..ఈసందర్బంగా ఏర్పాీటుచేసిన సమావేశంలో చీప్ మేనేజర్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ టెక్కె మేనేజర్ గా వరప్రసాదరెడ్డి బ్రాంచిని ఎంతో అభివృద్దిచేశారన్నారున..30కోట్లనుండి 100కోట్లకు పైగా బ్రాంచి టర్నోవర్ సాదించడం అంటే మేనేజర్ కష్టంతో పాటు ఖాతాదారుల సహకారం ఉందన్నారు..సిండికేట్ బ్యాంకు కెనెరాబ్యాంకులో విలీనం అవడంతో చిన్నపాటి సాంకేతిక సమస్యలు వచ్చాయని వాటినన్నంటిని అదిగమించామని మునుపటిలాగే కెనెరా బ్యాంకు అభ్యున్నతికి ఖాతాదారులు సహకరించాలన్నారు..ప్రస్తుతం బదిలీపై వెళుతున్న అదికారులు ఇద్దరూ పదోన్నతిపై బదిలీకావడం హర్ణనీయమన్నారు..మంచి ఖాతాదారులను వారి మన్ననలను పొందిన మేనేజర్ ప్రసాదరెడ్డి మరిన్ని ఉన్నతపదవులు పొందాలని ఆయన ఆకాంక్షించారు..అనంతరం పలువురు ఖాతాదారులు మాట్లాడుతూ మేనేజర్ గావరప్రసాదరెడ్డి ఖాతాదారులను చిరునవ్వుతో్ పలకరిస్తారనపి తనపరిదిలో ఎలాంటి సహాయం అయినా ఖాతాదారులకు అందిస్తూ ఖాతాదారుల గుండెల్లో నిలిచిపోయారన్నారు.ఇటువంటి అదికారి బదిలీపై వెళ్లడం భాదగా ఉన్నప్పటికి పదోన్నతిపై వెళ్లడం ఆనందంగా ఉందన్నారు..ప్రసాదరెడ్డి పదోన్నతిపై రీజనల్ మేనేజర్ గా తమ ప్రాంతానికి రావాలని కోరుకుంటున్నామని పలువురు ఖాతాదారులు ఆకాంక్షించారు..అనంతరం మేనేజర్ ప్రసాదరెడ్డి బావోద్యేగంగా మాట్లాడుతూ తనకు బ్యాంకు కేటాయించిన పనిని చిత్తశుద్దితోచేస్తేనే ఇంతమంది అభిమానులు తయారవడం ఇప్పుడు చూశానన్నారున..తాను 2009నుండి అంచెలంచెలుగా ఎదిగి స్కేలు 3 ఆపీసర్ గానెల్లూరు వెళుతున్నానంటే ఈ ఘనత ఖాతాదారులకే దక్కుతుందన్నారు..టెక్కె బ్రాంచిలో తాను జాయిన్ అయినప్పుడు సమస్యలు ఉన్నప్పటికి వాటిని అదిగమించి 33కోట్ల టర్నోొవర్ ఉన్న బ్యాంకుని 130కోట్ల టర్నోవర్ కుతీసుకువచ్చామంటే ఆఘనత ఖాతాదారులదే అన్నారు..ఎప్పటిలాగే టెక్కెబ్రాంచిలో రుణాలుతీసుకున్న ఖాతాదారులు సకాలంలో చెల్లించి తిరిగి రుణాలు పొందాలని తాను బ్రాంచినుండి వెళ్లినప్పటికి ఖాతాదారులకు అందుబాటులో ఉంటానన్నారు.అనంతరం చీప్ మేనేజర్ మల్లేశ్వరరావు సిబ్బంది,ఖాతాదారులు బదిలీపై వెళుతున్న మేనేజర్లు ప్రసాదరెడ్డి, కళాదర్ క్లర్కు సుమనలను ఘనంగా సన్మానించారు..కార్యక్రమంలో ఖాతాదారులు రామిరెడ్డి,ప్రభాకర్ చౌదరి, సత్యనారాయణ,ప్రసాద్ పలువురు ఖాతాదారులు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *