శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఘనంగా ముగిసిన ‘స్ప్రింగ్ ఫెస్ట్ 2K25’ .. నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే లక్ష్యమన్నచైర్మన్ రామకృష్ణ రెడ్డి

    ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి

నంద్యాల, 31 డిశెంబరు  2025(ప్రజాన్యూస్) :

నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల SBI colony వేదికగా నిర్వహించిన జాతీయ విద్యార్థి ఉత్సవం ‘స్ప్రింగ్ ఫెస్ట్ 2K25’ అత్యంత వైభవంగా ముగిసింది. విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు, వారిలో వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ వేడుకలో వివిధ ప్రాంతాల కళాశాలల నుంచి సుమారు 124 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు.ఈ ఫెస్ట్ ముగింపు వేడుకకు ముఖ్య అతిథులుగా కళాశాల చైర్మన్ గడ్డం రామకృష్ణ రెడ్డి , కళాశాల డైరెక్టర్ హేమంత్ రెడ్డి మరియు ప్రిన్సిపాల్ సుబ్బయ్య హాజరై ప్రసంగించారు.

ఈసందర్బంగాకళాశాల చైర్మన్ జి. రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం పుస్తక విజ్ఞానానికే పరిమితం కాకూడదని,. తరగతి గది చదువుతో పాటు ఇటువంటి వేదికలపై పాల్గొనడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు మరియు సమస్యలను పరిష్కరించే నేర్పు పెరుగుతాయన్నారు… ఈ స్ప్రింగ్ ఫెస్ట్ విద్యార్థులకు తమలోని అంతర్గత శక్తులను గుర్తించడానికి ఒక చక్కటి వేదికగా నిలిచింది” అని అన్నారు.కళాశాల డైరెక్టర్ హేమంత్ రెడ్డి మాట్లాడుతూ: “కార్పొరేట్ రంగం కోరుకుంటున్న నైపుణ్యాలను విద్యార్థులకు అందించడమే తమ లక్ష్యం అని గెలుపోటములు సహజమని,అయితే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని పోటీలో నిలబడడమే నిజమైన గెలుపన్నారు.. ఇక్కడ ప్రదర్శించిన నైపుణ్యాలు భవిష్యత్తులో విద్యార్దుల కెరీర్‌కు పునాదులు వేస్తాయన్నారు.. ప్రిన్సిపాల్ కె.బి.వి. సుబ్బయ్య మాట్లాడుతూ: వివిధ కళాశాలల నుండి వచ్చిన విద్యార్థుల ఉత్సాహం అభినందనీయమని, విద్యార్థులు చదువుతో పాటు పాఠ్యేతర అంశాల్లోనూ రాణించాలని సూచించారు. అనంతరం విజేతలను అభినందిస్తూ, బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమానికి ఈవెంట్ కన్వీనర్లుగా శ్రావణి కుమారి, సాదిక్, మరియు ఎం. ఇంతియాజ్ అహ్మద్ వ్యవహరించి పోటీలను ప్రణాళికాబద్ధంగా, విజయవంతంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఇతర కళాశాలల అధ్యాపక బృందం కూడా పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమం ఇంతటి ఘనవిజయం సాధించడానికి ఆర్థిక సహకారం అందించిన ప్రాయోజకులు – సౌజన్య మోటార్స్, గరుడ పాలిమర్స్, రాయలసీమ రుచులు, అన్నపూర్ణ హోటల్, సురభి కేఫ్, సుబ్బు క్లాత్స్ మరియు అబ్దుల్ కలాం జ్యువెలర్స్ యాజమాన్యాలకు, అలాగే కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అధ్యాపక, అధ్యాపకేతర బృందానికి మరియు విద్యార్థినీ విద్యార్థులకు కళాశాల యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *