ఆళ్లగడ్డ 30.01.2023 (ప్రజాన్యూస్)..ఆళ్లగడ్డ నియోజక వర్గ కమ్మ సంఘం న్యాయ సలహాదారు గా సీనియర్ న్యాయవాది బత్తిన శివప్రసాద రావు ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు
కాకతీయ కమ్శ సేవాసమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు బెజవాడ వెంకటరావు అధ్యక్షతన ఆళ్లగడ్డ పట్టణంలోని టి ఎస్ ఫంక్షన్ హాల్లో నియోజక వర్గ స్థాయి కమ్మవారి ఆత్మీయ సమ్మే ళనం జరిగింది..ఈ సమావేశంలో నియోజక వర్గ స్థాయి కమ్మ సంఘం ఆడ్ హాక్ కమిటీని రాష్ట్రనేతలు ఏకగ్రీవంగా ఎంపికచేశారు …కమిటీ న్యాయ సలహాదారుగా బత్తిన శివ ప్రసాద్ రావు ను రాష్ట్ర సంఘ అధ్యక్షుడు బెజవాడ వెంకటరావు మరియు ఇతర రాష్ట్ర నేతలు ఏక గ్రీవంగా ఎంపిక చేశారు.. ఈసందర్బంగా న్యాయవాది బత్తిన శివప్రసాదరావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్రసంఘకమ్మనేతలు పెట్టిన భాద్యతను చిత్తశుద్దితో నిర్వహిస్తానన్నారు..కమ్మవారు తమకులాన్ని గౌరవించుకుంటూ ఇతరకులాలతో సఖ్యతగా ఉండాలని సూచించారు..కార్యక్రమంలో మహానందీశ్వర కమ్మ సంఘ నేతలు నియోజక వర్గ కమ్మ బందువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..