ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిధి
కర్నూలు, జులై 24 (ప్రజా న్యూస్):జిల్లాలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేయుచున్న వర్కింగ్ జర్నలిస్ట్ లకు 2021-22 సంవత్సరానికి మొదటి విడతలో 627 మందికి మీడియా అక్రిడిటేషన్లు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు.
శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏ ఒక్క అక్రిడిటేషన్ దరఖాస్తును కూడా తిరస్కరించ లేదన్నారు. జి.ఓ.ఎం.ఎస్ నెంబర్ 142 లో ఉన్న అన్ని నిబంధనలను ఖచ్చితంగా పాటించి, అర్హత ఉన్న జర్నలిస్టులకు అక్రిడిటేషన్ ఇవ్వడానికి కమిటీ అంగీకారం తెలిపిందన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా జిల్లాలో అర్హత ఉన్న 627 మంది జర్నలిస్టులకు మొదటి విడతలో అక్రిడిటేషన్ లు మంజూరు చేశామన్నారు. అక్రిడిటేషన్ మంజూరు కానివారు రాష్ట్ర సమాచార శాఖ వెబ్ సైట్ లో వెంటనే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి, ఆ కాపీలను కర్నూలు ఉప సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు.. అనంతరం అప్లోడ్ చేసిన దరఖాస్తులను పరిశీలన చేసి తదుపరి సమావేశంలో అర్హత ఉన్న వారికి అక్రిడిటేషన్ మంజూరుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటి సభ్యులు డీఎంహెచ్ ఓ డా.రామ గిడ్డయ్య, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ కె వెంకటేశ్వర్లు, హౌసింగ్ అసిస్టెంట్ మేనేజర్ నడ్డయ్య, సౌత్ సెంట్రల్ రైల్వే చిప్ కమర్షియల్ సూపర్వైజర్ శ్రీనివాసులు, ఏపీఎస్ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ శశిభూషణ్, అక్రిడిటేషన్ కమిటి కన్వీనర్, సమాచార పౌర సంబంధాల శాఖ, ఉప సంచాలకులు కె.జయమ్మ, కన్వీనర్, సమాచార పౌర సంబంధాల శాఖ, ఉప సంచాలకులు కె.జయమ్మ, ఐఅండ్ పిఆర్ డిఈ జయరావ్, తదితరులు పాల్గొన్నారు.