*న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజీనామా వెనుక ఏం జరిగింది…?

దామోదర్ చిగులూరి సీనియర్ జర్నలిస్ట్ అమరావతి

అమరావతి జులై24:(ప్రజాన్యూస్);

*మోడీ,షా కోపానికి రవిశంకర్ అవుట్..??*

కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మంత్రి వర్గం నుంచి ఎందుకు వైదొలగాల్సి వచ్చింది.కేంద్రంలో ప్రధాని మోదీ,షాకు అత్యంత విశ్వాస పాత్రుడుగా పేరుపొందిన న్యాయశాఖ మంత్రి పదవి నుంచి వైదొలగాల్సి పరిస్థితి వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.మోడీ తొలగించిన 12 మందిలో రవిశంకర్ ప్రసాద్ పేరు ఉండటంతో కేంద్ర వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.కేంద్రంలో కీలక వ్యక్తులకు మినహా ఎందుకు రవిశంకర్ ప్రసాద్ మంత్రివర్గం నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చిందో తెలియదు. అంత కీలక మంత్రి రాజీనామా మోడీ కోరారు అంటే బలమైన కారణం ఉండే ఉంటుంది.అది మే 25 న బీజం పడింది.సీబీఐ చీఫ్ ఎంపిక విషయంలో జరిగిన పరిణామాలు ఇంతటి ప్రకంపనలు కారణమే కాదు.నేటికీ మోడీ,షా రవిశంకర్ ప్రసాద్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం లేదు అంటే ఆ కారణంతో మోడీ,షా ఎంతగా రగిలిపోతున్నారు అనేది అర్ధమవుతుంది. అది సీబీఐ చీఫ్ ఎంపిక.సీబీఐ చీఫ్ ను దేశంలోని ముగ్గురు వ్యక్తులు ఎంపిక చేస్తారు.దేశ ప్రధాని,ప్రధాన ప్రతిపక్ష నాయకుడు(లేదా ఆ పార్టీ సమర్దించిన నాయకుడు),దేశ ప్రధాన న్యాయమూర్తి.ఈ ముగ్గురూ ఏకాభిప్రాయం కు వస్తేనే సీబీఐ చీఫ్ ఎంపిక జరగడమే కాదు,ఏ ఇద్దరు ఎవ్వరినీ సమర్థిస్తే వారినే ఎంపిక చేయాలి కూడా.
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటీష్ వాళ్ళు 1941లో సీబీఐ ను ఒక ప్రత్యేకత కోసం ఏర్పాటు చేశారు.స్వాతంత్రం వచ్చి భారత ప్రభుత్వం ఏర్పడిన తరువాత అవినీతి నియంత్రణకు ఉపయోగించారు.ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 తీసుకు వచ్చారు.అయితే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ సెక్షన్ 4 ఏ (1) ప్రకారం సీబీఐ చీఫ్ ను ఎంపిక చేస్తారు.ఈ సారి సీబీఐ చీఫ్ ఎంపిక న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మెడకు చుట్టుకొంది.ఈ పదవికి 109 పేర్లతో కూడిన తొలి జాబితా సిద్ధం కాగా మే 25 రోజుకు 10 మంది అధికారులతో షార్ట్ లిస్ట్ తయారు చేశారు.వారిలో గుజరాత్ క్యాడర్ కు చెందిన వై.సి.మోడీ,లేదా రాకేష్ ఆస్థానా సీబీఐ చీఫ్ అవుతారని అనుకున్నారు.ప్రధాని మోఢీ కూడా గుజరాత్ అధికారి వైసి మోడీ ను సీబీఐ చీఫ్ గా తీసుకు రావాలని భావించారు.కానీ మే 25 జరిగిన భేటీలో ప్రధాని మోడీ,ప్రధాన ప్రతిపక్షం తరపున అధిర్ రాజన్ చౌదరి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్. వి.రమణ సుమారు 90 నిముషాల పాటు భేటీ అయ్యారు.ఈ భేటీలో సుమారు 6 నెలల సర్వీస్ ఉన్న అధికారులు ఈ పదవి ఎంపికకు అర్హులు కాదంటూ ప్రస్తావన రావడం,ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అధిర్ రాజన్ చౌదరి దానిని సమర్దించడంతో సమావేశంలో ప్రధాని మోడీ ఒంటరి అయ్యారు.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మూర్తి మరో జాబితా కోరడంతో అప్పటికప్పుడు మరో జాబితా ప్రధాన మంత్రి కార్యాలయం రూపొందించాల్సి వచ్చింది.ఈ నేపధ్యంలో లోనే మహారాష్ట్ర క్యాడర్ కు చెందిన సుబోధ్ కుమార్ జైస్వాల్ ను ఎంపిక చేయాల్సి రావడం ప్రధాని ఎటూ తేల్చుకోలేక అంగీకరించి సంతకం పెట్టాల్సి వచ్చింది.దీనితో ప్రధాని మోడీ సమావేశం తరువాత న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను పిలిచి న్యాయశాఖ లో 6 నెలల రిటైర్మెంట్ రూల్ తన దృష్టికి ఎందుకు తీసుకు రాలేదని ప్రశ్నించారు.ఈ పరిణామంతో న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మోఢీ కు సమాధానం చెప్పుకోలేకపోయారు.ఆ రోజు నుంచి రవిశంకర్ ప్రసాద్ ను ఒకొక్కటిగా కీలక బాధ్యతలు అప్పగించడం లేదు. తీరా మంత్రి వర్గ విస్తరణ నేపధ్యంలో ప్రధాని మోఢీ,షా లు సీబీఐ చీఫ్ ఎంపిక లో తమకు ఇష్టం లేని వ్యక్తి ఎంపిక కావడానికి మంత్రి రవిశంకర్ ప్రసాద్ కారణంగా భావించి అతని ని మంత్రి నుంచి తొలగించారు. ఆరోజు నుంచి రవిశంకర్ ప్రసాద్ మోఢీ ను కలిసి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నం చేసినప్పటికీ మోఢీ, షా కలవడానికి కూడా ఇష్ట పడటం లేదు.రవిశంకర్ ప్రసాద్ ఆర్.ఎస్.ఎస్ గవర్నర్ గా పంపాలని ప్రయత్నించినా ప్రయోజనం లేక పోయింది.ఇదీ రవిశంకర్ ప్రసాద్ పై మోఢీ కోపం.ఇలా ఉంటాయి కేంద్ర లోని మోఢీ తో పెట్టుకున్నా,మోడీ ఆత్మాభిమానం దెబ్బతిన్నా పరిణామాలు ఇలాగే ఉంటాయి అనేందుకు రవిశంకర్ ప్రసాద్ సంఘటన ఒక ఉదాహరణ.తన తప్పు లేకపోయినా మోడీ ఇద్దరు కీలక వ్యక్తులు సమక్షంలో మోడీ తలదించుకోవాల్సి వస్తే పాపం రవిశంకర్ బలయ్యారు.దటీజ్ ప్రధాని మోఢీ.

*స్టొరీ బై…*
*దామోదర్.చిగులూరి*
*జర్నలిస్ట్*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *