ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిది
నంద్యాల ఫిబ్రవరి 24(ప్రజాన్యూస్): నగరాలలో నిర్వహించే అరుదైన ఆపరేషన్ నంద్యాల పట్టణములోని సెవెన్ హిల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు నిర్వహించి ఆపరేషన్ విజయవంతంచేశారు నంద్యాలపట్టణంలోని సెవెన్ హిల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు..
ఈసందర్బంగా ఏర్పాటుచేసిన విాలేకరుల సమావేశంలో ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మారుతి మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన అర్ధరాత్రి 11.30 గం.ల సమయంలో గిద్దలూరు ప్రాంతానికి చెందిన 33 సంవత్సరాల వయసుగల సుబ్బారాయుడు విపరీతమైన కడుపునొప్పి తో రావడం జరిగిందని , వెంటనే వైద్యుల సలహా,సూచనలతో పరీక్షలు నిర్వహించి తక్షణమే శస్త్ర చికిత్సఅవసరమని నిర్దారణ అయిన వెంటనే పేషంట్ అంగీకారంతో ప్రముఖ సర్జన్ డా.బాస్కర్ రెడ్డి తో శస్త్ర చికిత్స (ఆపరేషన్) విజయవంతము చేయడం జరిగిందన్నారు..ఆపరేషన్ విజయవంతంచేసిన వైద్యులను ఆయన ఈసందర్బంగా అభినందించారు..
ఆపరేషన్ నిర్వహించిన డా.బాస్కర్ రెడ్డి మాట్లాడుతూ చిన్న ప్రేగు రంధ్రంలో ఇరుక్కుని పోవడం వలన శస్త్ర చికిత్స చేసి ప్రేగు కత్తిరించ కుండా అత్యాధునిక టెక్నాలజీ ద్వారా ప్రేగును రిపేర్ చేసి తిరిగి యధావిధిగా ఉండే విధంగా శస్త్ర చికిత్స చేయడం జరిగిందని అన్నారు.ఇటువంటి శస్త్ర చికిత్సలు చాలా అరుదుగా జరుగుతాయని, కొన్ని సమయాల్లో ఆలస్యం అవడం వలన పేషంట్ కి మల మార్గం ముసుకుపోయి ,మల మార్గాన్ని బయట పెట్టవలసి వస్తుందని , తిరిగి 3-6 నెలల తర్వాత దానిని యధాస్థానం లో రెండవ శస్త్ర చికిత్స చేయవలసి వస్తుందని , కానీ ఈ సుబ్బారాయుడు కి అటువంటి అవసరం లేకుండా శస్త్ర చికిత్స విజయవంతం చేశామని డా.బాస్కర్ రెడ్డి తెలిపారుమీడియా సమావేశంలో MD మారుతి కుమార్ గారితో పాటుగా సుధామోహన్ రెడ్డి, హాస్పిటల్ సిబ్బంది ప్రేమ్ కుమార్ ,రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు