అమరావతి జూన్ 23(ప్రజా న్యూస్): టీటీడీ చైర్మన్ పదవిని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలలోని ఒక మహిళకు కేటాయించాలని టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. మాన్సస్ ట్రస్ట్ నుంచి సంచయిత తొలగింపు అంశాన్ని మహిళా సాధికారతతో ముడిపెట్టడం వాసిరెడ్డి పద్మ అజ్ఞానానికి నిదర్శనమని అనిత విమర్శించారు. ఆమె వ్యాఖ్యలు హైకోర్టు తీర్పును ధిక్కరిస్తున్నట్లుగా ఉన్నాయని అనిత అభిప్రాయపడ్డారు.దొడ్డిదారిన సంచయితను నియమించారనే విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని మహిళలకు వైసీపీ ఏ విధమైన న్యాయం చేసిందో తాడేపల్లిలో మహిళపై జరిగిన అత్యాచార ఘటన రుజువు చేసిందన్నారు ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం నిజమైన మహిళా సాధికారత కు కృషిచేయాలని అనిత కోరారు.