అమరావతి జూన్ 23(ప్రజా న్యూస్): వ్యాక్సినేషన్ విషయంలో తప్పుడు లెక్కలతో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. ఇది ఫేక్ ప్రభుత్వం, జగన్ ఫేక్ ముఖ్యమంత్రి అని పట్టాభి దుయ్యబట్టారు.జూన్ 1 నుంచి 22 వరకు 58 లక్షల 74 వేల 201 డోసులు ఇచ్చామని ప్రభుత్వ తెలిపిందని వాస్తవానికి ఇచ్చింది 39 లక్షల 89 వేలు మాత్రమేనని పట్టాభి పేర్కొన్నారు. తామే నెంబర్వన్ అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని పట్టాభి విమర్శించారు. ఫేక్ సీఎంను అంకెలతో సహా రెండ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని ఇది ఫేక్ ప్రభుత్వం, జగన్ ఫేక్ ముఖ్యమంత్రి అని పట్టాభి దుయ్యబట్టారు. తెలిపారు.