♦ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి
శ్రీ మహానందీశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఆలయ కార్యనిర్వాహణాదికారి కాపు చంద్రశేఖర్ రెడ్డి మరియు హుండీ లెక్కింపు ప్రత్యేక అధికారి జనార్దన్ మరియు ఆలయ ఏఈవో సూపరిండెంట్ దేవస్థానం సిబ్బంది ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమము జరిగింది..ఈ కార్యక్రమంలో శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ కో ఆర్డినేటర్ శ్రీమతి లీల పరమేశ్వరి దేవి ఆధ్వర్యంలో మరియు తిరుమల శ్రీ బాలాజీ సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు. మహానంది దేవస్థాన అభిషేక మండపం యందు నిర్వహించిన ఉభయ ఆలయముల హుండీ లెక్కింపు ద్వారా 71 రోజులకు భక్తులు సమర్పించిన కానుకలు ఆలయాలకు 75,97,586,అన్నప్రసాదంకు 1,27,229,గోవు సంరక్షణకు 39,426. మొత్తం 77,64,241 రూపాయలు వచ్చాయని మహానందీశ్వర దేవస్థానం వెల్లడించింది.దేవస్థానం ఈఓ కాపు చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో హుండీ లెక్కింపునకు దేవాదాయ శాఖా తరుపున వెలుగోడు గ్రూప్ దేవాలయముల కార్యనిర్వహాణాధికారి వి జనార్ధన ,దేవస్థానం AEO వై మధు, పర్యవేక్షకులు ఓంకారం వేంకటేశ్వరుడు , టెంపుల్ ఇన్స్పెక్టర్లు బి.నాగ భూషణం, డి.రంగన్న, ఆలయ అర్చకులు, సిబ్బంది, ఏజెన్సీ వర్కర్స్, పలు గ్రామముల నుండి విచ్చేసిన భ్రమరాంబిక సేవా చీరాల సమితి సేవకులు,శ్రీ తిరుమల బాలాజీ సేవా సమితి కర్నూల్,బాలాజీ సేవా ట్రస్ట్ కర్నూల్ సేవకులు హాజరు అయ్యారు.