2024 లో నంద్యాలనుండి పోటీకి సర్వంసిద్దంచేసుకుంటున్న మాజీఎంపి గంగులప్రతాపరెడ్డి

నంద్యాల,అక్టోబరు 16(ప్రజాన్యూస్):నంద్యాల నుండి 2024 ఎన్నికల బరిలో తలపడేందుకు మాజీ ఎంపి గంగులప్రతాపరెడ్డిసర్వంసిద్దంచేసుకుంటున్నారు..ఈమేరకు ఆయన నంద్యాలపట్టణంలో కార్యాలయం ఏర్పాటును కూడా పూర్తిచేసుకున్నారు..త్వరలో కార్యాలయం

ప్రారంభించి ప్రజలకు దగ్గర అయ్యేందుకు ప్రణాళికలు సిద్దంచేశారు..నంద్యాల పార్లమెంటు లేదా అసెంబ్లీకి సైతం పోటీచేసేందుకు గంగులప్రతాపరెడ్డి సిద్దం అయినట్లుఆయనసన్నిహితవర్గాలుస్పష్టంచేస్తున్నాయి..గత కొన్ని సంవత్సారలుగా గ్రేటర్ రాయలసీమ ఉద్యమాన్ని  ప్రజలకు చేరువచేసేందుకు సమయాన్ని వెచ్చించిన గంగుల ప్రతాపరెడ్డి ఆ ఉద్యమాన్ని కోొనసాగిస్తునే క్రియాశీలక రాజకీయాల్లో చురుకుగా పాల్గొని ప్రజలకు చేరువ అయ్యేందుకు సిద్దం అయ్యారు…నంద్యాల పార్లమెంటు లేదా అసెంబ్లీ లో పోటీ కి సిద్దమయిన గంగుల ఏపార్టీనుండి పోటీచేస్తారన్న విషయం స్పష్టం కానప్పటకి నూటికి నూరుశాతం 2024 ఎన్నికల బరిలో ఖాయంగా ఉంటానని గంగుల ప్రతాపరెడ్డి స్పష్టంచేస్తున్నారు..

రాజకీయ నేపద్యం

ప్రస్తుత నంద్యాలజల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని యర్రగుడిదిన్నెలో 1950 జూలై నెల 1వతేదీన జన్మించిన గంగుల ప్రతాపరెడ్డి 1980,2004 మద్యకాలంలో ఆళ్లగడ్డ  శాసనసభ్యులుగాను,నంద్యాలపార్లమెంటు సభ్యులుగాను కాంగ్రెస్ పార్టీలో జనరల్ సెక్రటరీ గాను వెనుకబడిన తరగతి కమిటి వెల్పేర్ కమిటీలో మెంబరుగాను,పబ్లిక్ అకౌంట్స్ కమిటి మెంబరుగాను ప్రజలకు సేవలందించారు..1991లో పదవ లోక్ సభకు నంద్యాలనుండిపోెటీచేసి ఎంపిగా ఎన్నికయ్యారు..అప్పట్లో ప్రదాని పివి నరసింహారావుకోసం తన పదవిత్యాగంచేసిన గంగుల పివిని అత్యదికి మెజారిటీతో గెలిపించేందుకు తన పాత్రను పోషించారు…ప్రస్తుత ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడుకి,అప్పటి ముఖ్యమంత్రు వైయస్ రాజశేఖరరెడ్డికి గంగుల ప్రతాపరెడ్డి సమకాలికుడు…నాటి ముఖ్యమంత్రి కోట్లకు ప్రియ శిష్యుడు గంగుల.పేరుపెట్టి పిలుచుకునే స్వతంత్రం వీరితో గంగులకు ఉంది…అప్పటికాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రి రేసులో ఉన్న కీలక వ్యక్తిగా గంగులకు గుర్తింపు ఉంది..గల్లీ స్థాయినుండి డిల్లీ వరకు తన ఖ్యాతిని చాటిన గంగుల ప్రతాపరెడ్డికి డిల్లీ నేతలతో మంచి సన్నిహిత సంబందాలు ఉండేవి..

నంద్యాలలో గంగుల గ్నాపకాలు

రాష్ట్ర విభజన నేపద్యంలో ఆంద్రప్రదేశ్ కు ఏమికావాలో కూడా అడగకుండా విభజనఆంద్రప్రదేశ్ ను ముంచేసిన నేతలు ఉన్న కాలంలో  తన పదవిని త్యాగంచేసి నంద్యాలప్రాంత అబివృద్దికి తనవంతు కృషిచేసిన గంగుల ప్రతాపరెడ్డి చేపట్టిన అబివృద్ది చిరస్థాయిగా నంద్యాలలో నిలచింది.

నేడు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గాంచి ప్రభుత్వానికి రైతులకు ఆదాయాన్ని సమకూరుస్తున్న నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ ఆనాడు కేంద్రపెద్దలను ఓప్పించి నంద్యాలకు తెచ్చింది గుంగలప్రతాపరెడ్డి.

నూనేపల్లె  ఉపరితల వంతెన ఏర్పాటుచేసి నూనేపల్లె నంద్యాలవాసుల అనుసందానం గంగుల కృషి పలితమే

రైల్వేస్టేషన్ ఆధునీకరణ చేసి బ్రాడ్ గేజ్ కు శ్రీకారం చుట్టి, ఆనేడే నంద్యాల యర్రగుంట్ల లైనుకు పౌండేషన్ స్టోన్ వేసిన ఘనత గంగులకు దక్కుతుంది..

నంద్యాల వాటర్ వర్క్స్ పేరుతో కేంద్రప్రభుత్వ నిదులను తెచ్చి ఉమ్మడి కర్నూలుజల్లాలో 300కు పైగా గ్రామాలకు సురక్షత నీరు అందించిన ఘనత కూడా గంగుల కు దక్కుతుంది..ఇవే కాక ఆద్యాత్మిక కేంద్రంగా అహోబిళంను తీర్చిదిద్దదిన ఘనతకూడా గంగులకుదక్కుతుంది..

శాశ్వత అబివృద్దే ద్యేయంగా పనిచేసిన గంగుల ప్రతాపరెడ్డి రాయలసీమ వెనుకబాటుతనం గుర్తించి ఈ ప్రాంతప్రజలకు ఏదో చేయాలన్న తపనతో గ్రేటర్ రాయలసీమ ఉధ్యమం వైపుమొగ్గుచూపారు..అయితే నేడు ఆఉద్యమాన్ని ప్రజలకు చేరువచేస్తూ ప్రత్యక్ష రాజకీయాీల్లోకి రావడానికి ఆయన సిద్దం అవడం విశేషం..కాగా నంద్యాలపార్లమెంటునుండి తెలుగుదేశం పార్టీనుండా ?వైకాపానుండా ? బిజేపి నుండి పోటీచేస్తారా అన్న విషయం నర్మగర్భంగా ఉంచిన గంగుల ప్రతాపరెడ్డి పోటీకి మాత్రం సర్వం సిద్దంచేసుకుంటున్నారు..నంద్యాలపార్లమెంటు పరిదిలో బందుత్వాలు,స్నేహాలు,అనుచర వర్గం..బలంగా ఉన్న గంగులప్రతాపరెడ్డి రాజకీయ ప్రస్థానం తిరిగి ప్రారంభించిన వార్త విన్న ఆయన వర్గంతో పాటుగా పలువురు సీనియర్లు సమకాలికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు..నంద్యాలపార్లమెంటు నుండి టిడిపి కిపోటీచేసి తన తమ్ముడు గంగుల ప్రభాకరరెడ్డికి పోటీ అవుతారా? వైకాపానుండి పోటీచేసి తమ్ముడికి స్నేహహస్తం అందిస్తాడా..టిడిపినుండి పోటీచేస్తే తమ చిరకాల ప్రత్యర్దులు భూమా కుటుంబంతో కలిసి పనిచేస్తారా ?బిజెపినుండి పోటీచేసి ఇరువర్గాలకు ప్రత్యర్ధి అవుతారా ?అన్న చర్చ రాజకీయ వర్గాలలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *