ప్రభాకర్ చౌదరి ప్రజాన్యూస్ ప్రతినిధి
నంద్యాల జూలై20(ప్రజాన్యూస్):కర్నూలుజిల్లాసంజామల నుండి కల్వటాల గ్రామం వరకు రైల్వే ట్రాక్ నిర్మాణం నిమిత్తం భూసేకరణ కొరకు గాను భూ యజమానులతో సమీక్ష నిర్వహించామని నంద్యాల సబ్ కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ అన్నారు
మంగళవారం నంద్యాల సబ్ కలెక్టర్ వారి కార్యాలయంలో సంజామల నుండి కల్వటల గ్రామం వరకు రైల్వే ట్రాక్ నిర్మాణం నిమిత్తం భూసేకరణ కొరకు గాను భూ యజమానులతో నంద్యాల సబ్ కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ .APIIC జోనల్ మేనేజర్ C వెంకటనారాయనమ్మ . సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలనాధికారి హరినాథ్ రావు .సంజామల తహసీల్దార్ అనిల్ కుమార్ లతో కలసి సమీక్ష నిర్వహించారు
ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ చహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ సంజామల మండల కేంద్రం నుండి కల్వటల గ్రామం వరకు రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ నిమిత్తమై నిర్మించనున్న రైల్వే ట్రాక్ నిర్మాణం కొరకు అల్వకొండ గ్రామ పొలిమేర లోని దాదాపు 50 ఎకరాల భూమి అవసరం ఉన్నందున భూసేకరణ నిమిత్తమై భూ యజమానులతో సమీక్ష నిర్వహించామని ఈ సమీక్షలోభూయజమానులతో చర్చించడం జరిగిందని భూమి యొక్క ధర నిర్ణయం జిల్లా కేంద్రంలోని ఉన్నత అధికారుల సమక్షంలో నిర్ధారించడము జరుగుతుంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సంజామల మండలం తహసిల్దార్ అనిల్ కుమార్ .DI రవీంద్ర పాల్ మండల సర్వేయర్ కృష్ణయ్య అల్వకొండ విఆర్ఓ అల్వకొండ భూమి యజమానులు తదితరులు పాల్గొన్నారు