ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
నంద్యాల, ఆగస్టు 18 (ప్రజాన్యూస్) ::
నంద్యాలపట్టణంలో అత్యాదునిక వసతులతో రాయలసీమ హాస్పిటల్స్ నూతన బిల్డింగ్ లో ప్రారంభమయింది..ప్రముఖ ఆర్దోపెడిక్ వైద్యులు డాక్టర్ విష్ణువర్ఱనరెడ్డి ఆద్వర్యంలో నిర్వహిస్తున్న ఈ హాస్పిటల్ లో వివిద విభాగాలను మాజీ ఎంఎల్ సి ఇసాక్ భాషా, మాజీ ఎంఎల్ఎ భూమా బ్రహ్మానందరెడ్డి ,నంద్యాలజిల్లా టిడిపి కార్యదర్శి పిరోజ్, మాజీ ఎంపి పోచా బ్రహ్మానందరెడ్డి ప్రారంబించారు..
గత దశాబ్దకాలంగా నంద్యాలపట్టణంలో ఆర్దో పెడిక్ విబాగంలో విశిష్ట సేవలను అందించిన రాయలసీమ హాస్పిటల్స్ అదినేత డాక్డర్ విష్ను వర్దనరెడ్డి మరో అడుగు ముందుకు వేసి ప్రజలకు మరింత అత్యాదునిక వైద్యసేవలు అందించేందుకు శ్రీనివాసనగర్ లో సొంత ఆసుపత్రి భవనంలో వైద్యసేవలను ప్రారంభించారు..డాక్టర్ కావ్యకొండా ఆద్వర్యంలో నిర్వహిస్తున్న కంటి వైద్యసేవలు సైతం ఈ ఆసుపత్రిలోనే అందనున్నాయి..కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పూజా కార్యక్రమానికి పట్టణంలోని ప్రముఖవైద్యులు,ప్రజాప్రతినిదులు, ఈకార్యక్రమానికి హాజరయి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు..ఈసందర్బంగా డాక్టర్ విష్ను వర్దనరెడ్డి మాట్లాడుతూ గత దశాబ్దకాలంగా శ్రీనివాససెంటర్లో తాము ఆర్దో సేవలను ప్రజలకు అందించామన్నారు.ఇటీవలే డాక్టర్ కావ్య కొండా ఆద్వర్యంలో కంటి వైద్యసేవలను కూడా అందిస్తున్నామన్నారు..నేడు మరో అడుగు ముందుకు వేసి అదే ప్రాంతంలో పాత ఆసుపత్రికి ఎదురుగా స్వంత భవనాలతో ఆదునిక వైద్యసేవలు అందించేందుకు నూతన ఆసుపత్రి నిర్మించి ప్రారంబించామన్నారు..రాయలసీమ హాస్పిటల్స్ లో అత్యాదునిక ఆర్దో,కంటి వైద్య పరికరాలు ఏర్పాటుచేశామన్నారు..అన్ని వర్గాలకు అనుగుణంగా జనరల్, లగ్జరీ, విఐపి రూంలను ఏర్పాటుచేశామన్నారు..వైద్యంకోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా అత్యాదునిక సౌకర్యాలతో ఆపరేషన్ దియేటర్లను సైతం ఏర్పాటుచేశామన్నారు..ఈసందర్బంగా ఆసుపత్రి ప్రారంబానికి హాజరయి పలు విభాగాలను ప్రారంభించిన మాజీ ఎంఎల్ఎ భూమా బ్రహ్మానందరెడ్డి, టిడిపినేత పిరోజ్ మాట్లాడుతూ డాక్టర్ విష్ను వర్దనరెడ్డి అనతికాలంలోనే ఆర్దో పెడిక్ వైద్యంలో పలువరి ప్రశంసలు అందుకున్నారని వారి ఆద్వర్యంలో నిర్వహిస్తున్న ఆదునిక వైద్యశాల ప్రజలకు మరిన్ని సేవలను అందించేలా తీర్చిదిద్దారన్నారు..నంద్యాలలో ఆదునిక వైద్యం అందించేందుకు ముందుకు వచ్చిన డాక్టర్ విష్ను వర్దనరెడ్డిని ఈ సందర్బంగా నేతలు అభినందించారు..కార్యక్రమంలో పట్టణంలోని పలువురు డాక్టర్లు, కేశవరెడ్డి విద్యాసంస్దల అదినేత కేశవరెడ్డి,ఎంఎల్సి ఇసాక్ భాష, రాయలసీమ ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు..