ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
డిల్లీ, ఆగస్టు 18 (ప్రజాన్యూస్) ::
ఢిల్లీ కి వచ్చి పార్లమెంట్ ఆవరణలోని టీడీపీ ఎంపీ కార్యాలయంకు వచ్చిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ను టీడీపీ, జనసేన ఎంపీలు ఘనంగా సత్కరించారు.ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేష్ సోమవారం కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, నితిన్ గడ్కరీ.హర్దీప్‌సింగ్, సోనావాల్, పీయూష్ గోయల్. జైశంకర్ లతో విడివిడిగా భేటీ అయ్యేందుకు వచ్చి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కార్యాలయం సందర్శించారు. ఏపీకి సంబంధించిన పలు ప్రతిపాదనలు కేంద్ర మంత్రులకు నారా లోకేష్ బృందం అందజేయనున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం సకాలంలో నిధులు అందించి రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని కోరామని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి చెప్పారు.