కొత్త ‘పబ్‌జీ’.. అర్థరాత్రి నుంచి రిజిస్ట్రేషన్లు…

న్యూఢిల్లీ : కొత్తగా మొదలుకానున్న పబ్‌జీ గేమ్ కోసం ఈ అర్థరాత్రి నుంచి రిజిస్ట్రేషన్లు మొదలుకానున్నాయి. భారత్‌లో తారస్థాయిలో ప్రాచుర్యంలోకొచ్చిన పబ్‌జీ… కొన్ని పరిణామాలు, విమర్శల నేపధ్యంలో…దీనిపై ప్రభుత్ం కిందటేడాది నిషేధించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో… తాజాగా ‘బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా’ పేరుతో మళ్ళీ ప్రారంభం కాబోతోంది.

క్రాప్టన్ ఇంక్ సంస్థ భారత్‌లోని యూజర్ల కోసం ఈ రోజు(మంగళవారం) అర్థరాత్రి నుంచి ఈ గేమ్ రిజిస్ట్రేషన్‌లను ప్రారంభించనుంది. బ్యాటిల్ గ్రౌండ్ గేమ్ కోసం రిజిస్ట్రేషన్లు గూగుల్ ప్లే-స్టోర్ నుంచి చేసుకోవచ్చు. అయితే… ఈ గేమ్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో సంస్థ వెల్లడించలేదు. వచ్చే నె 10 వ తేదీన ఈ గేమ్ లాంచ్ కానున్నట్లు వినవస్తోంది.

ఇక… ఈ గేమ్ కోసం ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకునే వారి డేటా గోప్యత, డేటా భద్రతకు పూర్తి ప్రాధాన్యతనిస్తున్నట్లు క్రాప్టన్ ఇంక్ వెల్లడించింది. ఇక కేంద్రం నియమాలకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. డేటా భద్రత కోసం ఇతర సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని వివరించింది. ఇక గేమ్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన మరికొన్ని వివరాలిలా ఉన్నాయి.

  • పద్ధెనిమిదేళ్ళ వయస్సు దాటిన వారే… ఈ గేమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అర్హులు.
  • బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్ రిజిస్ట్రేషన్‌లు గూగుల్ ప్లే స్టోర్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయి.
  • గూగుల్ ప్లేస్టోర్‌లో ప్రీ రిజిస్ట్రేషన్ లింక్‌ను క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత… యాప్ పేజీని తెరిచి ‘ప్రీ రిజిస్టర్’ బటన్ మీద నొక్కితే… రిజిస్ట్రేషన్ పూర్తయినట్లే. ఇక… గేమ్ అందుబాటులోకి వచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది
  • ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లు మాత్రమే ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెసులుబాటు ఉంది. ఐవోఎస్ వినియోగదారులకు సంబంధించి మాత్రం… ప్రీ రిజిస్ట్రేషన్, లాంచింగ్ వివరాలను క్రాప్టన్ ఇంక్ సంస్థ వెల్లడించలేదు.
  • కేవలం భారత్‌కు చెందిన వారే ఈ గేమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రస్తుతానికి వెసులుబాటు ఉంది.
  • ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న యూజర్లకు ప్రత్యేకంగా ఇన్ గేమ్ రివార్డులను అందిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. కాగా… ఈ రివార్డులు భారత్‌లో గేమ్ ఆడేవారికి ప్రత్యేకంగా ఉంటాయని వినవస్తోంది.
  • గేమ్ ఆడాలనుకునేవారు తమ తల్లిదండ్రుల మొబైల్ నంబర్‌ను కూడా తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *