ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి
డిల్లీ,మార్చి 17(ప్రజా న్యూస్)
సోమవారం సాయంత్రం ఢిల్లీ లోని రాష్ట్రపతి భవనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆతిథ్యంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు తోటి పార్లమెంటు సభ్యులతో కలిసి నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి హాజరయ్యారు.రాష్ట్రపతి ఆహ్వానం ఎంతో గౌరవంగా, స్ఫూర్తిదాయకంగా అనిపించిందని, దేశ సేవలో అంకితభావంతో పనిచేస్తున్న మేమంతా ఒకే వేదికపై కలుసుకోవడం ఆనందదాయకంగా, మధుర జ్ఞాపకంగా ఉందని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.