చాగలమర్రి ఆగష్టు12(ప్రజా న్యూస్); ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తే చర్యలు తప్పవని చాగలమర్రి తహసీల్దార్ చంద్రశేఖర్ నాయక్ గురువారం హెచ్చరించారు. రికార్డులలో ఉన్నట్లు, క్షేత్రస్థాయిలో ఉండకపోవడం తదితర పొరపాట్లను సరిచేసుకోవాలని సూచించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించడానికి వీల్లేదని ఆయన తెలిపారు. మండల కేంద్రంలోని చాగలమరి మేజర్ గ్రామ పంచాయతీలో ఆక్రమణకుగురైనప్రభుత్వస్థలాలనుఆయనపరిశీలించారు. ఆక్రమణదారులు ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని, జిల్లాకలెక్టర్ఆదేశాల
మేరకుచర్యలుతీసుకుంటామన్నారు. ఈయన వెంట డిప్యూటీ తాసిల్దార్ శివ శంకర్ రెడ్డి, మేజర్ గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుదర్శన్ రావు, తదితరులు ఉన్నారు.