కర్నూలు(ఆళ్లగడ్డ)జూన్24(ప్రజాన్యూస్):ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో రైతు సంక్షేమం కోసం తెలంగాణ లో నీటి ప్రాజెక్టు లు నిర్మించిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పై తెలంగాణా నీటిపారుదల శాఖ మంత్రి ప్రకాష్ రెడ్డి విమర్శలు చేయడం తగదని ఏపీ శాసన మండలి విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి హితవు పలికారు…గురువారం కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ పరిధిలోని దొరనిపాడు, ఉయ్యాలవాడ మండలాల పరిధిలో కుందు నది ఆధునీకరణ పనులను స్థానిక ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి,ఆళ్లగడ్డ ఎం ఎల్ ఏ గంగుల బిజేంద్రరెడ్డి తో కలిసి ప్రారంభించారు…ఈ సందర్భంగా గంగుల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నాటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జ
లయజ్ఞం కార్యక్రమన్ని అక్కడి ప్రజలు, నేతలు ఇప్పటికీ కొనియాడుతుంటే మంత్రి చేస్తున్న విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు..వై ఎస్ తనయుడు ఎపి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కల్పించడం లేదని న్యాయ బద్దంగా ఏపీకి రావలసిన నీటి వాటా సముద్రం పాలు కాకుండా ఏపీలో భావితరాలకోసం చర్యలు తీసుకుంటున్నారన్నారు..పోతిరెడ్డిపాడు వెడల్పు,కుందు ఆదు నీకరణ ద్వారా సీమ రైతాంగానికి సాగునీరు,తాగునీరు సమస్యలు తొలగడంతోపాటుగా వరద బాధిత ప్రాంతాలకు మేలు జరుగుతుందన్నారు..