నంద్యాలలో వై ఎస్ ఆర్ అర్బన్ క్లినిక్ లను లాంఛనంగా ప్రారంభించిన నంద్యాల మున్సిపల్ చైర్మన్షేక్ మబునిసా.

నంద్యాల జూన్ 24(ప్రజా న్యూస్): నంద్యాల పట్టణంలో 4 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించేలా 5 వై ఎస్ ఆర్ అర్బన్ క్లినిక్ లను ప్రభుత్వం మంజూరు చేసింది..ఇందులో పూర్తి అయిన 3 క్లినిక్ లను నంద్యాల మున్సిపల్ కమీషనర్ వెంకట కృష్ణ ఆద్వెర్యంలో మున్సిపల్ చైర్ పర్సన్ షై క్ మాబున్నిసా గురువారం లాంఛనంగా ప్రారంభించారు పట్టణంలోని శ్రీనివాస నగర్. గాంధీనగర్. ఎన్జీవోస్ కాలనీ లలో ఏర్పాటు చేసిన ఈ క్లినిక్ లు నేటినుండి సేవలు అందిస్తాయి .అనంతరం నంద్యాల పురపాలక సంఘం అధ్యక్షురాలు షేక్ .మబునిసా మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం విద్య- వైద్యానికి పెద్దపీట వేసిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ప్రజలందరికీవైద్యం అందించాలని ఉద్దేశంతో ప్రతి 40 వేల జనాభాకు ఒక అర్బన్ హెల్త్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నారని అందులో భాగంగా నంద్యాలలో 4 కోట్ల రూపాయల వ్యయంతో ఐదు అర్బన్ హెల్త్ సెంటర్లు మంజూరయ్యాయన్నారు.అందులో 3సెంటర్లకు డాక్టర్లు వైద్య సిబ్బంది వచ్చారని  తాత్కాలిక భవనాలలోఈక్లినిక్లుఏర్పాటుచేస్తున్నమన్నారు.12.11.13.35.36.39.43. వార్డులకు గాను శ్రీనివాస్ నగర్ లోని డేనియల్ పురం గేటు దగ్గర ఒక అర్బన్ హెల్త్ సెంటర్ ను. 32 రైతు నగరం 12ఉడుమలుపురం నకు సంబంధించి గాంధీ నగర్ నందు ఒక అర్బన్ హెల్త్ సెంటర్.16.17.18.20.21.23.29.13. వార్డు లకు సంబంధించి ఎన్జీవోస్ కాలనీ నందు ఒక అర్బన్ హెల్త్ సెంటర్ ను తాత్కాలిక భవనములో ఈరోజు ప్రారంభించా మన్నారు

నంద్యాల మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం విద్య- ఆరోగ్యానికి పెద్ద పీట వేసిందని .నాడు- నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలలను ఆరోగ్య కేంద్రాలను సుందరంగా ఆధునీకరించి వార్డులోని ప్రజలకు ప్రాథమిక వైద్యాన్ని అందిస్తుందని అందులో భాగంగానే ఈరోజు నంద్యాల పట్టణంలో మూడు హార్బర్ హెల్త్ సెంటర్లను తాత్కాలిక భవనాల్లో లాంఛనంగా ప్రారంభించుకున్నామనరు మన రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ప్రమాణాలను పెంచుకునే విధంగా 40 వేల జనాభాకు ఒక అర్బన్ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారన్నారు వార్డులోని వార్డు వాలంటీర్లు ఈ అర్బన్ హెల్త్ సెంటర్ ల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసి ప్రజలు ప్రాథమిక వైద్యం కొరకు ఈ అర్బన్ హెల్త్ సెంటర్ కు వచ్చేలా ప్రజలను చైతన్య పర్చాలన్నారు.అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్ల ద్వారా గర్భిణీ స్త్రీలకు బాలింతలు అర్బన్ హెల్త్ సెంటర్ నుంచి మెరుగైన వైద్యం పొందేలా వారు మహిళలను చైతన్య పరచాలన్నారు..కార్యక్రమంలో కౌన్సిలర్ దేశం సులోచన. మునిసిపల్ కార్యాలయం సిబ్బంది మునిసిపల్ కౌన్సిలర్లు. సచివాలయ సిబ్బంది డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *