అమరావతి జూన్ 18(ప్రజాన్యూస్):ఏపీ శాసనమండలి ప్రొటెం చైర్మన్గా వి.బాలసుబ్రహ్మణ్యంను నియమిస్తూ గవర్నర్ హరిచందన్ ఉత్తర్వులు జారీ చేశారు. శాసనమండలి చైర్మన్, డిప్యూటి చైర్మన్ పదవీకాలం ముగియడంతో వి.బాలసుబ్రహ్మణ్యంను నియమించారు. సోమవారం నూతన సభ్యులతో ప్రొటెం చైర్మన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కొత్త చైర్మన్ ఎన్నిక వరకు ఈ పదవిలో బాలసుబ్రహ్మణ్యం కొనసాగుతారు. ఈయన మూడు సార్లు మండలికి ఎన్నికయ్యారు..గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా లేళ్ల అప్పిరెడ్డి (గుంటూరు), మోషేన్ రాజు (పశ్చిమ గోదావరి), ఆర్వీ రమేశ్ యాదవ్ (కడప), తోట త్రిమూర్తులును ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆమేరకు గవర్నర్ విశ్వభూణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. గవర్నర్ కోటాలో నలుగురు వైసీపీ సభ్యులు మండలిలో చేరుతున్నారు. శుక్రవారంతో ఏడుగురు తెలుగుదేశం సభ్యులు వైసీపీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పదవీవిరమణ చేస్తున్నారున. దీంతో మండలిలో వైసీపీ బలం 20కి పెరిగితే.. టీడీపీ సభ్యుల సంఖ్య 15కు పరిమితం కానుంది.