నంద్యాల జూన్ 18(ప్రజా న్యూస్):-కర్నూలు జిల్లా నంద్యాల కోవిడ్ ఆసుపత్రికి లక్ష ఇరవై వేల రూపాయల విలువ చేసే AC మిషన్లను నంద్యాల పార్లమెంట్ సభ్యుడు పోచ బ్రహ్మానంద రెడ్డి విరాళంగా ఇచ్చారు
తన స్వంత నిధులు లక్ష ఇరవై వేల రూపాయల విలువ చేసే AC మిషన్లను ఈ సందర్భంగా ఎంపీ ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయకుమార్ కి అందజేశారు..అనంతరం నంద్యాల పార్లమెంట్ సభ్యుడు పోచ బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోన రెండో దశలో విజృంభించి ప్రజలను ఎంతో బాధ పెడుతుందని అందుకొరకే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక కోవిడ్ కేర్ సెంటర్లను ,కోవిడ్ ఆస్పత్రులను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు అని అన్నారు అంతేకాకుండా నంద్యాల పట్టణంలోని జిల్లాస్థాయి ప్రభుత్వ ఆసుపత్రి అవరణం లోను .ఎస్ ఆర్ బి సి. కోవిడ్ కేర్ సెంటర్ ఆవరణంలో జర్మనీ టెక్నాలజీ తో నిర్మించిన షెడ్డులలో అన్ని వసతులతో కూడిన తాత్కాలిక ప్రాథమిక కేంద్రాలను, నూరు పడకలు గల ప్రధమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసి మెరుగైన సేవలందిస్తుంది అన్నారు కరోన కష్టకాలంలో స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు ,దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలన్నారు.