ఆయుర్వేదిక్‌ మందులతో బ్లాక్‌ఫంగస్‌ పనిపట్టొచ్చు!

హైదరాబాద్‌ : బ్లాక్‌ఫంగస్‌ వ్యాధిని ఆయుర్వేద మందులతో నియంత్రించడం సాధ్యమేనని తెలంగాణ ఆయుష్‌ విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ అలగు వర్షిణి అన్నారు. రాష్ట్రంలో బ్లాక్‌ఫంగస్‌ ప్రభావం తక్కువగానే ఉందని, ఇమ్యునిటీ బూస్టర్స్‌ ద్వారా దీన్ని నిరోధించ వచ్చని తెలిపారు. ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో బుధవారం ఆయుర్వేదిక్‌ వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో బ్లాక్‌ఫంగస్‌ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోందని, అలాంటి ప్రమాదకర వైర్‌సను సైతం ఎదుర్కొనే శక్తి ఆయుర్వేద మందులకు ఉందని అన్నారు. స్టెరాయిడ్స్‌ తీసుకున్న వారందరికీ బ్లాక్‌ఫంగస్‌ రాదని, మధుమేహ రోగులు, ఎక్కువకాలం పాటు స్టెరాయిడ్స్‌ తీసుకున్న వాళ్లపై మాత్రమే బ్లాక్‌ఫంగస్‌ ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పారు. ఆయుర్వేదిక్‌ మందులు వాడితే నష్టం తగ్గుతుందన్నారు. ఇప్పటికే చాలామంది ఈఎన్‌టీ అస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ప్రభుత్వం అక్కడ ఆయుర్వేద మందులనే రోగులకు అందిస్తోందని తెలిపారు.

బ్లాక్‌ఫంగ్‌సకు ఇప్పటికే ఆల్లోపతి మందులు తీసుకుంటున్న వారు కూడా ఆయుర్వేద మందులు వాడొచ్చొన్నారు. బ్లాక్‌ఫంగస్‌ రాకుండా ముందుజాగ్రత్తగా కూడా ఈ మందులు వినియోగించ వచ్చని ఆమె తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆయుర్వేద మందుల షాపుల్లోనూ ఈ మందులు లభిస్తాయని, ప్రభుత్వం  త్వరలో వీటిని ఉచితంగా అందిస్తుందని వెల్లడించారు. బ్లాక్‌ఫంగ్‌సకు గాంధీ అస్పత్రి, ప్రభుత్వ ఈఎన్‌టీ అస్పత్రి, కింగ్‌ కోఠి అస్పత్రుల్లో చికిత్స అందిస్తునట్లు తెలిపారు. ఆయుర్వేదిక్‌ కాలేజీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా.ఎం. ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. కొవిడ్‌ బారిన పడ్డవారు మొదటివారం ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్‌ వాడొద్దన్నారు. 6 నుంచి 9 రోజుల పాటు జీర్ణశక్తి మందగించి ఉంటుందని, ఇలాంటి స్థితిలో జీర్ణవ్యవస్థపై ఎక్కువ ఒత్తిడి పెడితే సమస్యలు సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. బాగా ఉడికిన అన్నం, లేదా గంజి తీసుకోవాలని ఆయుర్వేద శాస్త్రం చెబుతోందని, రుచిలేమి, ఆకలి మందగిస్తే దనియాలతో కూడిన బాగా ఉడికించిన పెసరపప్పు అన్నం తినాలని తెలిపారు. మనిషి జీర్ణశక్తి బలహీనంగా మారినప్పుడే సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. వాంతులు, విరోచనాలు అయినప్పుడు కొంత సమయం ఏమీ తినకుండా జావ, ఇతర ద్రవాలు తీసుకొంటూ కొద్దిగా శక్తి వచ్చిన తర్వాత పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. స్టెరాయిడ్స్‌, యాంటీబయాటిక్స్‌ వాడకాన్ని తగ్గించడం వల్లబ్లాక్‌ఫంగస్‌ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *