వాషింగ్టన్ : కరోనా నేపధ్యంలో విధించిన లాక్‌డౌన్ కాలంలో… ప్రజలు దాదాపుగా ఇళ్లకే పరిమితం కావడంతో… జననాల రేటు పెరుగుతుందని అధికారులు భావించారు. కానీ అగ్రరాజ్యమైన అమెరికాలో… పరిణామాలు ఇందుకు విరుద్ధంగా చోటుచేసుకున్నాయి. వివరాలిలా ఉన్నాయి.
వాస్తవానికి అమెరికాలో కరోనా నేపధ్యంలో 2020 లో జననాల రేటు తగ్గింది. ముందటేడు(2019) అమెరికా మొత్తం మీద 37.5 లక్షల జననాలు నమోదు కాగా, నిరుడు(2020) ఆ సంఖ్య అనూహ్యంగా పడిపోవడం విశేషం. గతంతో పోలిస్తే 4శాతం తగ్గిపోయింది. అమెరికా ప్రభుత్వం ఈ పరిస్థితిపై దృష్టి సారించింది.