న్యూఢిల్లీ: దేశ ప్రజలందరికీ ఈ ఏడాది డిసెంబర్ కల్లా కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. రాజస్థాన్‌లో కోవిడ్ పరిస్థితిని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సతీష్ పునియా, పార్టీ ఎంలతో వర్చువల్ సమావేశాలంలో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా వైరస్ సెకెండ్ వేవ్ పొంచి ఉన్నందున సన్నద్ధంగా ఉండాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు గత మార్చిలోనే ప్రధాని హెచ్చరించినట్టు చెప్పారు. కేవలం తొమ్మిది నెలల్లో రెండు దేశవాళీ వ్యాక్సిన్‌లను తొలిసారి భారత్ డవలప్ చేసిందని, ఇంతవరకూ 18 కోట్ల మంది భారతీయులకు వ్యాక్సిన్ ఇచ్చామని తెలిపారు. డిసెంబర్ చివరి కల్లా అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అన్నారు. అన్ని రాష్ట్రాలకు ఆక్సిజన్, మందుల సరఫరాకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు.