ప్రజాటివి ప్రతినిది ఖాసింవలి![]()
నంద్యాల,08 జనవరి 2025(ప్రజాన్యూస్)

ప్రభుత్వ సొమ్మును అక్రమంగా తన స్వంత ఖాతా, సోదరి ఖాతాలకు బదిలీ చేసుకొని కోటి రూపాయలకు పైగా సొమ్మును అక్రమంగా స్వాహా చేసిన అహోబిలం పి.హెచ్.సి సీనియర్ అసిస్టెంట్ ఇంతియాజ్ అలీఖాన్ ను గురువారం అరెస్టు చేసినట్లు ఆళ్లగడ్డ డి.ఎస్.పి ప్రమోద్ తెలిపారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఔట్సోర్సింగ్ వైద్య సిబ్బంది జీతాల బిల్లులకు సంబంధించి ఫేక్ బిల్లులను సృష్టించి ఆయన తన స్వంత ఖాతాకు మళ్లించుకోవడం జరిగిందన్నారు. ఆడిట్ అధికారుల విచారణలో ఈ భాగోతం బయటపడడంతో జిల్లా ట్రెజరీ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కేసు కు సంబంధించి మరింత లోతుగా విచారణ జరుపుతున్నట్లు డి.ఎస్.పి ప్రమోద్ వివరించారు. మీడియా సమావేశంలో రూరల్ సీఐ బివి రమణ, ఎస్సై వరప్రసాద్ పాల్గొన్నారు.