ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
నంద్యాల, 03 డిశెంబరు 2025(ప్రజాన్యూస్) :

నంద్యాల పట్టణంలోని నూనెపల్లె మార్కెట్ యార్డ్ ప్రాంగణానికి భద్రత మరియు రక్షణ కల్పించడంలో కీలకమైన కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ,నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు భూమి పూజ చేశారు
ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ మార్కెట్ యార్డ్‌కు కాంపౌండ్ వాల్ నిర్మించడం వలన ఇక్కడ జరుగుతున్న వ్యాపార కార్యకలాపాలకు, రైతులకు మరియు నిల్వ చేసిన సరుకులకు పూర్తి భద్రత లభిస్తుందని తెలిపారు. ఈ నిర్మాణంతో నూనెపల్లె మార్కెట్ యార్డ్‌కు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమానికి, స్థానిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు మాట్లాడుతూ మంత్రి ఎన్ ఎండి పరూఖ్ సహకారంతో మార్కెట్ యార్డును అభివృద్దిచేసి రైతుల సహాయకారిగా ఉంచేలా కృషి చేస్తానన్నారు..
ఈ కార్యక్రమంలో నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి కల్పన , గోస్పాడు మండల టిడిపి కన్వీనర్ తులసీశ్వర్ రెడ్డి, 21 వ వార్డు కౌన్సిలర్ శ్రీదేవి , మాజీ కౌన్సిలర్ శివశంకర్ యాదవ్, గుద్దేటి వెంకటేశ్వర్లు, జెపి , బ్యాంకు తిమ్మయ్య, మంజుల సుబ్బరాయుడు, మిద్దె ఉసేని , రంగ ప్రసాద్, స్వామి నాయక్, వడ్డే జనార్ధన్, వడ్డే నాగేశ్వరరావు మరియు స్థానిక నాయకులు, మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు, వ్యవసాయ అధికారులు, రైతు ప్రతినిధులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.