ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
నంద్యాల, 07నవంబరు 2025(ప్రజాన్యూస్) :

నవంబరు 7న నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే సందర్బంగా నంద్యాల పట్టణంలో రోటరీ క్లబ్ అద్యక్షుడు వివేకానాందరెడ్డి, ఇన్నర్ వీల్ క్లబ్ అద్యక్షులు మల్లేశ్వరి ఆద్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు..స్థానిక ఉదయానంద హాస్పిటల్ వారి సహకారంతో , నారాయణ జూనియర్ కాలేజీ విద్యార్థిని విద్యార్థుల మరియు అధ్యాపకుల సహకారంతో నంద్యాల రోటరీ క్లబ్,మరియు ఇన్నర్ వీల్ క్లబ్ నంద్యాల వారి ఆధ్వర్యంలో క్యాన్సర్ పై ప్రజలలో అవగాహన పెంచడానికి క్యాన్సర్ ను ఏ విధంగా నివారణ చేసుకోవాలి వాటికి సంబంధించి వ్యాక్సిన్సులు ఏ సంవత్సరంలోపు వారు వేసుకోవాలి అన్న విషయాలపై వీరు అవగాహన ర్యాలీ నిర్వహించారు.. ఈ ర్యాలీ శోభ హోటల్ నుంచి శ్రీనివాస సెంటర్,శ్రీ నిధి టిఫెన్ సెంటర్, బెకర్స్ పార్క్ మీదుగా కొనసాగింది.. ర్యాలీలో ఉదయానంద హాస్పిటల్ కు సంబంధించిన డాక్టర్లు ప్రణీత్. డాక్టర్ సుదర్శన్ రెడ్డి,డాక్టర్ గీత డాక్టర్ కుశల, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ న్యాయవాది వివేకానంద రెడ్డి, ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్, ఎం ఎన్ మల్లేశ్వరి ,పిడీజీలు రామలింగారెడ్డి, శ్రీరామ్మూర్తి చిన్నపరెడ్డి, ఇన్నర్ వీల్ సభ్యులు సుశీల. సువర్చల, రోటరీ సభ్యులు కైలాసనాద్ రెడ్డి సుబ్బరామయ్య. లక్కా భూషణం. ఇన్నర్ వీల్ సభ్యులు. వసుంధర, సుధ తదితరులు పాల్గొన్నారు.