ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
కర్నూలు, 25అక్టోబ ర్ 2025(ప్రజాన్యూస్) :


కర్నూలు పట్టణంలోని మార్కెట్ యార్డులో ఉమ్మడి కర్నూలుజిల్లా మార్కెట్ యార్డు చైర్మన్ల ఆత్మీయ సమావేశం శనివారం జరిగింది..ఈ సమావేశంలో నంద్యాల కర్నూలు జల్లాలకు చెందిన మార్కెట్ యార్డుచైర్మన్లు పాల్గొన్నారు..ఈసందర్బంగా వారు ఉమ్మడి కర్నూలుజిల్లాలోని మార్కెట్ యార్డుల స్థితిా గతులపై చర్చించారు..గతంకంటే మెరుగైన సేవలు రైతులకు అందించేందుకు తీసుకోవలసిన నిర్ణయాలపై సుదీర్ఘ చర్చ నిర్వహించారు..భవిష్యత్తులో మార్కెటు యార్డుల అభివృద్దికి కూటమి ప్రభుత్వ సహాయ సహకారాలు పొందేందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకున్నారు..ఈ సందర్బంగా నంద్యాల మార్కెటు యార్డుచైర్మన్ గుంటుపల్లి హరిబాబు మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లా మార్కెుటు యార్డు చైర్మన్ల ఆత్మీయ సమావేశం ఎంతో ఆహ్లాదకరంగా సాగిందన్నారు..జిల్లాలో మార్కెట్ యార్డుల తీరు తెన్నులపై మంచి అవగాహన ఈ సమావేశంతో లభించిందన్నారు..ప్రభుత్వ సహాయ సహకారాలతో ఎలా మంచి పేరు తేవాలన్న అంశాలపై చర్చ తనకు ఎంతో తృప్తి నిచ్చిందన్నారు..