మైనారిటీల అభ్యున్నతికి కృషి చేస్తున్న వారికి ‘కంపానియన్‌షిప్ ఇన్ స్పోర్ట్స్ అండ్ ఫిట్‌నెస్’ అవార్డులు అందించిన మంత్రి పరూఖ్

    ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి

విజయవాడ, 19అక్టోబ ర్ 2025(ప్రజాన్యూస్) :

కంపానియన్‌షిప్ ఇన్ స్పోర్ట్స్ అండ్ ఫిట్‌నెస్’ సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అట్టహాసంగా అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. క్రీడలు, ఫిట్‌నెస్‌ రంగాలలో విశేష కృషి చేసిన మరియు ముస్లిం మైనారిటీల అభ్యున్నతి కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న పలువురు ప్రముఖులకు ఈ సందర్భంగా అవార్డులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్యఅతిథిగా హాజరై అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ఈ అవార్డు గ్రహీతలంతా మైనారిటీ కమ్యూనిటీకి చెందినవారై ఉండడం చాలా సంతోషంగా ఉందన్నారు . వీరంతా తమ వృత్తిపరమైన రంగాలతో పాటు, తమ సమాజానికి సేవ చేయడంలోనూ ముందున్నారని . ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీ విద్య, ఆరోగ్యం, క్రీడలు వంటి రంగాలలో అభివృద్ధి సాధించేందుకు వీరు అందిస్తున్న సహకారం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు . మైనారిటీ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఈ విజేతలు ఇతరులకు ఆదర్శప్రాయులని కొనియాడారు. క్రీడలు, ఫిట్‌నెస్ ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు, సామాజిక సేవకు అంకితం కావాలనే సందేశాన్ని ఈ అవార్డులు ఇస్తున్నాయని పేర్కొన్నారు.

అలాగే ప్రస్తుతం వీరి సేవలు గుంటూరు , విజయవాడ , విశాఖపట్నం ప్రాంతాలలో ఉన్నాయని ఈ సేవలను మరింత అభివృద్ధి చేసి రాయలసీమ ప్రాంతంలో మైనార్టీలు ఎక్కువగా ఉండే నంద్యాల , కర్నూలు , కడప లాంటి ప్రాంతాలలో కూడా వీరి సేవలను విస్తరింప చేయాలని దానికి కావాల్సిన సహాయ సహకారాలు పార్టీలకు అతీతంగా తాము అందిస్తామని మంత్రి ఫరూక్ తెలిపారు

‘కంపానియన్‌షిప్ ఇన్ స్పోర్ట్స్ అండ్ ఫిట్‌నెస్’ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, సమాజానికి నిస్వార్థంగా సేవలందిస్తున్న వ్యక్తులను గుర్తించి, గౌరవించడమే తమ లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులోనూ ఇటువంటి స్ఫూర్తిదాయక కార్యక్రమాలను కొనసాగిస్తామని ప్రకటించారు.

ఈ కార్యక్రమం అవార్డు గ్రహీతలు, వారి కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *