ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
నంద్యాల, 16అక్టోబ ర్ 2025(ప్రజాన్యూస్) :
👉జర్నలిజానికి తూట్లు
👉సంపాదనే ద్యేయంగా అడ్డగోలు బ్లాక్ మెయిల్
👉ప్రదాన స్రవంతి మీడియా పేర్లతో అనుసరణ
👉రాష్ట్ర వ్యాప్త మీడియా అంటూ ప్రచారం
👉మండలానికో రిపోర్టర్
👉కలర్ ఐడి కార్డులతో షోపుటప్
👉ఒక్కో కార్టు 10 వేలకు విక్రయం
👉భారత బ్రాడ్ కాష్టింగ్ నిబందనలకు తూట్లు
👉డిజిటల్ మీడియా చట్టాలు భేఖాతర్
👉శ్రుతిమించుతున్న యూట్యూబర్ల ఆగడాలు
భారత స్వాత్రంత్రం పూర్వమే తమకదనాలతో స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుకు నడిపి భారతదేశానికి స్వాతంత్ర పలాలు అందించిన పత్రికారంగం అంచెలంచెలుగా ఆదునీకరించబడింది..మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఆదునికత పొంది దృశ్యరూపంలో ప్రజలకు సమాచారాన్ని అందించే స్థాయికి మీడియా రంగంఎదిగింది..ఈరంగం మరింత ముందడుగు వేసి నేడు కొత్తపుంతలు తొక్కింది..ప్రింట్ మీడియాకు దీటుగా ఎలక్ట్రానిక్ మీడియా తనదైన శైలిలో ప్రజలకు ప్రభుత్వానికి వారదిలా నిలిచింది..నేడు డిజిటల్ మీడియా రంగ ప్రవేశం చెయ్యడంతో ప్రదాన స్రవంతి మీడియా సైతం డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టాయి..ప్రపంచం వ్యాప్తంగా గ్లోబలైజేషన్ కావడంతో సోషియల్ మీడియా రంగ ప్రవేశం చేసింది..ప్రప్రంచ వ్యాప్తంగా ఏ సంఘటన జరిగినా సోషల్ మీడియాలో ముందుగా ప్రజలకు సమాచారం అందుతోంది..ఈనేపద్యంలో వాట్సాప్, ట్విట్టర్, ఎక్స్ యూట్యూబ్ ఇన్ స్టా గ్రాం లాంటి సోషల్ మీడియా విస్త్రతంగా ప్రాచుర్యానికి వచ్చాయి..ఇది మంచి పరిణామమే..
అయితే మంచి వెనుక చెడుకూడా ఉంటుందికదా..ఈ విస్త్రతస్థాయి మీడియాను వింతపోకడలకు వినియోగించుకుంటున్న ప్రబుద్దులు రోజురోజుకు పెరిగిపోతున్నారు..ఈ కోవలేనో యూట్యూబర్స్ ఆగడాలు మితిమీరిపోయాయి..ఇప్పటివరకు ఇండియాలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా హౌస్‌లు నడపాలంటే భారత ప్రభుత్వం రిజిస్ట్రార్ ఆప్ న్యూస్ పేపర్స్ ద్వారా ప్రింట్ మీడియా అనుమతి, శాటిలైట్ చానల్స్, కేబుల్ టివి చానల్స్ అయితే మినిష్టరీ ఆప్ బ్రాడ్ కాస్టింగ్ ద్వారా రిజిష్టరు చేసుకుని తమకార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి..అయితే డిజిటల్ ప్లాట్ పాం కేటగిరికిచెందిన యూట్యూబర్లు తమ మెయిల్ ద్వారా యుట్యూబ్ చానల్ ఓపెన్ చేసుకోవచ్చు..భారత మంత్రిత్వ శాఖద్వారా రిజిష్టరు అయిన మీడియా హౌస్ లకు తమ కార్యకలాపాలు నిర్వహించడానికి అనేక నిబందనలతో పాటు వ్యయాలు కూడా ఎక్కువే..చిన్న పేపర్లు ఎన్నో వ్యవప్రయాసలకు ఓర్చి పేపర్లను నడుపుతున్నారు..కేబుల్ టివి ద్వారా న్యూస్ కంటెంట్ ఇవ్వడం అంటే కూడా ఖర్చుతో కూడి ఉంటుంది..ఈ ప్లాట్ పాంల ద్వారా న్యూస్ కంటెంట్ క్వాలిటి ఎక్కువగా ఉంటుంది..జవాబుదారితనం ఉంటుంది..వీరికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వం అక్రిడేషన్ కూడా ఉంటుంది…అయితే సోషియల్ మీడియాలో సర్వం వారే కావడంతో నిత్యం అసత్య ప్రసారాలతో పాటుగా ఎర్నింగ్ జర్నలిజానికి తెరదీశారు..ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది యూట్యూబర్లు మంచి కంటెంటు ఇచ్చి యూట్యూబ్ ద్వారా వేలనుండి కోట్లదాకా సంపాదిస్తుంటే కొంతమంది జర్నలిజం పేరుతో ఎర్నలిజం మొదలు పెట్టారు..అటు భారత బ్రాడ్ కాస్టింగ్ నిబందనలు పాటించకుండా ఇటు యూట్యూబ్ నిబందనలు పాటించకుండా జర్నలిజానికి తూట్లు పొడుస్తున్నారు..సంపాదనే ద్యేయంగా సమాజంలో అన్ని రంగాలవారిని అడ్డగోలు బ్లాక్ మెయిల్ చేసేందుకు తెగబడుతున్నారు..ఓ ట్యూబ్ క్రియేట్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు కావాలంటూ అందమైన ప్రకటనలు ఇస్తు ఎటువంటి విద్యార్హతలేనివారికి సైతం మెడలో ఓ ఐడి కార్డు తగిలించి చేతికి ఓలోగో ఇచ్చి వారివద్దనుండి ఐదువేలనుండి పదివేల వరకు వసూలుచేసి ఐడి కార్డులు ఇస్తున్నారు..వీరికి ఎలాంటి జీతభత్యాలు ఉండవు..వీరు సమాజంమీద పడి బ్లాక్ మెయిల్ చేయడమే వీరి విదులు..దీంతో ప్రజలుబెంబేలెత్తుతున్నారు..
ఓ జిల్లాకేంద్రాన్ని ఉదాహరణగా తీసుకుంటే జల్లాలో దాదాపుగా 6నుండి 7 నియోజకవర్గాలు ఉంటాయి..నియోజకవర్గంలో కనీసం ఐదునుంచి ఆరు మండలాలు ఉంటాయి..అంటే జిల్లా వ్యాప్తంగా 30 నుంచి 35 మండలాలు ఉంటాయి..అంటే ఓ యూట్యూబర్ జిల్లాకు వివిద పేర్లుపెట్టి 50 మందిని రిపోర్టర్ల పేరుతో నియమిస్తున్నారు..ఒక్కరే ఇంతమందిని నియమిస్తే జిల్లా వ్యాప్తంగా దాదాపు 100 నుండి 200 యూట్యూబ్ చానల్స్ ఉన్నాయి..అంటే కనిస్టంగా 5వేలనుండి 10 వేలమంది యూట్యూబ్ రిపోర్టర్లు గా చలామణి అవుతున్నారు..వీరిలో మంచికంటెంట్ తో పనిచేస్తూ ఉన్న సంస్థలు ఉన్నాయి..అయితే ఎక్కువ శాతం పట్టణాలు గ్రామాలలో ప్రజాప్రతినిదులను, అదికారులను, ప్రభుత్వ ప్రయివేటు కార్యాలయాల్లో, ప్రభుత్వ పాటశాలలు,ప్రయివేటు పాఠశాలలు, ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులను టార్గెట్ గా చేసుకుని న్యూస్ ,యాడ్స్ పేరుతో బెదిరించి బ్లాక్ మెయిల్ చేయడం పరిపాటిగా మారింది..రూ. 500 నుండి రూ.10 లక్షల వరకు వీరు డిమాండ్ చేస్తుంటారు..దీంతో ఏ వ్యాపారంచేయాలన్నా వీరి దెబ్బకు భయపడుతున్నామని అన్ని వర్గాల వారినుండి పిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి..
ఇటీవల కొంతమంది యూట్యూబర్లు ప్రదానస్రవంతిమీడియా పేర్లకు సమాంతరంగా పేర్లను క్రియేట్ చేసుకుని ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు..ఉదాహరణకు టివి 9 ప్రదాన స్రవంతిమీడియా పక్కన తెలుగు అని లేదా మరో పదంచేర్చి యూట్యూబ్ చానల్ క్రియేట్ చేస్తారు..అలాగే ఆంద్రజ్యోతి,సాక్షి పక్కన ఏదో ఒక పదం తగిలించి ఆయా పేర్లతో రిపోర్టర్లుగా చలామణి అవుతున్నారు..సొసైటీలో పేరున్న మీడియా చానళ్లు,లేదా పేపర్లను టార్గెట్ చేసి వాటి ముందు లేదా వెనుక ఓ పదంచేర్చి ప్రజలను మోసంచేస్తున్నారు..వీరు నిజంగా జర్నలిజం చేయాలనుకుంటే మంచి పేరు, ఎవరూ ఉపయోగించని పేరు క్రియేట్ చేసుకుని ప్రజలకు మంచి సమాచారం అందించవచ్చు..పాపులర్ అయి యూట్యూబ్ సంస్థనుంచి కూడా డబ్బు తీసుకోవచ్చు..కాని వీరి ఉద్యేశ్యం అదికాదు ప్రజలను పక్కదోవపట్టించి బ్లాక్ మెయిల్ చేసుకోవడం..ఇటీవల కొంతమంది యూట్యూబర్లు భారత కంపెనీల చట్టం ప్రకారం రిజిస్టరు అయ్యామని కేంద్రప్రభుత్వ అనుమతితో అని ప్రచారంచేస్తున్నారు.వీరు కేవలం ఆరు వేలు ఖర్చు పెట్టి కంపెనీ రిజిష్టరు చేస్థారు.కంపెనీ నిబందనలు, బ్రాడ్ కాస్ట నిబందనలు ఏమీ వీరు అనుసరించరు..అందుక తగ్గ నిబందనలు పాటించరు….తమ సంస్త గుర్తింపు పొందిన సంస్థ అని ప్రచారంచేసుకుని వేలమందిని రిపోర్టర్ల పేరుతో నియమించి వారి ద్వారా బ్లాక్ మెయిల్ చేసి కోట్లకు పడగులు ఎత్తుతున్నారు..ఇటు కంపెనీల చట్టం అటు బ్రాడ్ కాస్టింగ్ చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు.
ఇటీవల కొంతమంది యూట్యూబర్లు ప్రాంతీయ కార్యాలయాలు ,ప్రదాన కార్యాలయాల ప్రారంబం అంటూ జిల్లా వ్యాప్తంగా మంత్రులను ఎంఎల్ఎలను, ప్రతిపక్షనేతలను జిల్లా స్థాయి పోలీసు రెవెన్యూ అదికారులను సైతం ఆహ్వానిస్తూ తమ సంస్థ రాష్ట్రవ్యాప్త మీడియా సంస్థగా ప్రచారం చేస్తున్నారు..అదికారులు ప్రజాప్రతినిదులు ఇటువంటి వారిని గుడ్డిగా నమ్మకూడదు..ఏదేనిసంస్థ కార్యకలాపాలపై క్షుణ్ణంగా తెలుసుకొని వారికి అండదండలు ఇవ్వాలి..నేడు ఎంతోమంది సీనియర్ జర్నలిస్టులు రిటైర్డు అయ్యి స్వంత డిజిటల్ ప్లాట్ పారం ఏర్పాటుచేసుకుని మంచికంటెంటుతో మంచి కధనాలను ప్రజలకు అందిస్తున్నారు.వారి మార్గంలో నడిచేందుకు ప్రయత్నించాలి…ఇటీవల ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియా లో అడ్డగోలు పోకడలను అరికట్టే ఉద్దేశ్యంతో మంత్రుల కమిటీని నియమించింది అంటే వీరి ఆగడాలు ఏస్థాయికి వచ్చాయో ఇట్టే అర్దంచేసుకోవచ్చు..ఇటీవల నకిలీ విలేకర్లను అరికట్టడానికి తిరుపతి జిల్లాలో క్యూ ఆర్ కోడ్ తో జిల్లా ఎస్ పి ఐడికార్డులు ఇవ్వడం గమనార్హం ..ఇప్పటికైనా సోషల్ మీడియాను దుర్వినియోగంచేస్తు,ప్రజలను భయబ్రాంతులను చేస్తున్న వారిపై ప్రభుత్వం ,పోలీసులు డేగకన్ను ఉంచి నిజమైన జర్నలిస్టులను కాపాడాలని జర్నలిస్టు సంఘాలు సమాజంలోని వివిద వ్యాపార వర్గాలు అదికారులు కోరుతున్నారు..
ఎల్లో జర్నలిజాన్ని ఎలా తగ్గించాలి?
-
మీడియా లిటరసీ పెంపొందించాలి – ప్రజలు ఏ వార్త నిజమో, ఏది కాకపోవచ్చో తెలుసుకునే సామర్థ్యం పెరగాలి.
-
విశ్వసనీయ మీడియా ను ప్రోత్సహించాలి – నిజమైన సమాచారాన్ని అందించే పత్రికలు, ఛానళ్లు, డిజిటల్ ప్లాట్‌ఫారాలను ఆదరించాలి.
-
ప్రభుత్వ నియంత్రణతో పాటు స్వీయ నియంత్రణ – మీడియా సంస్థలు తమ స్వీయ నియమావళులను పాటించాలి.
-
తప్పుడు వార్తలపై చట్టపరమైన చర్యలు – ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.