ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
నంద్యాల, 03అక్టోబ ర్ 2025(ప్రజాన్యూస్) :
నంద్యాల పట్టణంలోని ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా దసరా సందర్బంగా నెలకొల్పిన అమ్మవారి విగ్రహ నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది..
దసరా శరన్నవరాత్రుల సందర్బంగా పట్టణంలోని బైరమల్ వీది ఆంద్రబ్యాంకు సమీపంలో అమ్మవారి విగ్రహాన్ని నెలకొల్పి 10 రోజుల పాటు అమ్మవారికి స్థానిక కమిటీ పూజలు నిర్వహించారు..శరన్నవరాత్రి ముగింపు సందర్బంగా అమ్మవారి వసంత ఉత్సవము వైభవంగా నిర్వహించారు..అనంతరం కోలాహలంగా అమ్మవారిని కోట వీధి ,వినాయక ఘాట్ గుండా చిన్న చెరువుకు ఊరేగింపుగా తీసుకువచ్చారు..అనంతరం చిన్న చెరువులో అమ్మవారి విగ్రహ నిమ్మజ్జనం భక్తి శ్రద్దలతో నిర్వహించారు..కార్యక్రమంలో ఉత్సవ కమిటీ శేఖర్ తోపాటుగా అమ్మవారి భక్తులు పాల్గొన్నారు..