దూదేకుల ఉద్యోగుల సంక్షేమానికి పాటుపడుతాం..దూదేకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిద్దయ్య మరియు కన్నయ్య

ప్రజాటివి ప్రతినిది ఖాసింవలి

నంద్యాల,22 సెప్టెంబరు 2025(ప్రజాన్యూస్)

నంద్యాల పట్టణంలోని ఎన్జీవో హోం లో DSC- 2025 నందు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులుగా నియామకం పొందిన అభ్యర్థుల ఆత్మీయ సన్మాన కార్యక్రమం రాష్ట్ర దూదేకుల సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి మౌలాలి మరియు డి దస్తగిరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు..

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి. సిద్దయ్య మరియు డి. కన్నయ్య మాట్లాడుతూ ఇటీవల జరిగిన డీఎస్సీ పరీక్షల యందు అత్యున్నత ప్రతిభ కనబరిచి ఉద్యోగ నియామకాలు సాధించిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.. దూదేకుల ఉద్యోగుల సంక్షేమం కొరకు ఈ సంఘం ఎల్లవేళలా కృషి చేస్తుందని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలియజేశారు. సంఘ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పి వసుమతి మాట్లాడుతూ డీఎస్సీ నియామక పరీక్షల్లో అధిక శాతం అమ్మాయిలు ఎంపిక కావడం అభినందనీయమని తెలిపారు. సంఘ జాతీయ ఉపాధ్యక్షులు సుంకేసుల ఖాదర్ భాషా మాట్లాడుతూ సమాజంలో దూదేకుల ఉద్యోగులు మరింత చైతన్యవంతం కావాలని ఇందుకు తమ తోడ్పాటు అందిస్తామని తెలిపారు. సమాజంలో దూదేకుల కులం వారు మరింత చైతన్యవంతం కావాలని , సంఘ సంక్షేమం కొరకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని సంఘ జిల్లా గౌరవ అధ్యక్షులు డి హసన్ పేర్కొన్నారు. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదనీ విద్యార్థినీ విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించాలని సంఘ సీనియర్ నాయకులు డి యాసిన్ బాబు, నబి రసూల్ తమ అభిప్రాయాలను తెలియజేశారు.
సన్మాన గ్రహీతలందరూ తమ వృత్తికి న్యాయం చేస్తామని ఈ సందర్భంగా హామీని ఇచ్చారు. సన్మానించిన వారిలో తేజ, ముంతాజ్ ,మౌలాభి, అనూష, మహబూబ్ బాషా మైజూన్ బి ,మౌలాలమ్మ తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు ఆళ్లగడ్డ ఖాసీం వలి,డీ ఫక్రుద్దీన్, నాగరాజు, బకర్ సాహెబ్ ,మహబూబ్ బాషా, ఫక్రుద్దీన్, దస్తగిరి, ఖాజా మియా, మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *