ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
నంద్యాల, 18సెప్టెంబరు 2025(ప్రజాన్యూస్) :
నంద్యాల పట్టణంలోని పద్మావతినగర్ లోని మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో ఇన్నర్‌వీల్ సబ్యురాలు, దంతవైద్యులు డాక్టర్ ఈశ్వరి సహకారముతో 1౩౦ మoధి విద్యార్థినివిద్యార్థులు కు దంతాల పరీక్షచేసి దంతాల శుబ్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేసారు.
అలాగే చిగుళ్లకు సంబందించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి డా. వరుణ్ తెలియజేసారు.ఈసందర్బంగా 130 మoధి విద్యార్థిని విద్యార్థులకు టూత్ పేస్టులు, బ్రష్ లు పంపినీ చేశారు… కార్యక్రమం లో ఇన్నర్‌వీల్ అద్యక్షురాలు ఎం.ఎన్.మలీశ్వరి, సబ్యులు సుశీల, విజయలక్ష్మి, నాగమణి, విజయకుమారి,నిర్మలా,వసుంధర,తులసి, మిన్నల విజయ రాధా, సులోచన, కవిత,ప్రధానోపాధ్యాయుడు తిమ్మరాజు,టీచర్ విజయ పాల్గొన్నారు.