ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
నంద్యాల, సెప్టెంబరు 17 (ప్రజాన్యూస్) :
భారత ప్రధాన మంత్రి, విశ్వనాయకుడు నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని,సేవాకార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా బిజెపి అధ్యక్షుడు డా. అభిరుచి మధు రక్తదానం చేసి, సమాజానికి గొప్ప సందేశం ఇచ్చారు.
ఈసందర్బంగా డాక్టర్ అభిరుచి మధు మాట్లాడుతూ,దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్న మహానాయకుడు నరేంద్ర మోదీ పుట్టిన రోజు, కేవలం వేడుకలు కాదని, ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలతో జరుపుకోవాలని ప్రతి కార్యకర్త ఆలోచించాలన్నారు.మానవతా సేవలో భాగంగా రక్తదానం అత్యంత పవిత్రమైన పనని, ఒకరికి ఇచ్చే రక్తం, మరొకరి ప్రాణాన్ని నిలబెట్టగలదన్నారు..అందుకే ఈ ప్రత్యేక రోజున రక్తదానం చేశానన్నారు..కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లాలో బిజెపి కార్యకర్తలు కూడా రక్తదాన శిబిరంలో పాల్గొని మానవతా సేవకు చేయూతనిచ్చారు.ఈ సందర్భంగా బిజెపి నాయకులు, కార్యకర్తలు డాక్టర్ మధును అభినందిస్తూ, ఆయన ఆలోచన ప్రతి యువతకు ఆదర్శం కావాలని ఆకాంక్షించారు.