ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
నంద్యాల, సెప్టెంబరు 13 (ప్రజాన్యూస్) ::
నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల లో సోమవారం అనగా 15.09.2025 క్యాంపస్ నందు ప్లేస్మెంట్ డ్రైవ్ జరుగనున్నట్లు కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ జి. రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ బెంగళూరు పట్టణంలోని K12 Techno services pvt.ltd. అనే సంస్థ శ్రీ రామకృష్ణ విద్యాసంస్థల విద్యార్థుల కోసం ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారని,. ఇందులో ఎంపికైన విద్యార్థులకు సంవత్సరానికి 3 లక్షల వేతనంతో పాటు 1.5 లక్ష రూపాయల వరకు ఇతర ప్రయోజకాలు ఉంటాయని విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని తెలిపారు.
కళాశాల ప్రిన్సిపల్ కేబీవీ సుబ్బయ్య మాట్లాడుతూ ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ కు 2025వ సంవత్సరం వరకు ఏదేని డిగ్రీ పూర్తి చేసిన ఈ కళాశాల విద్యార్థులతో పాటు 2026వ సంవత్సరంలో పూర్తి చేయబోతున్న విద్యార్థులు అనగా ఇప్పుడు తృతీయ సంవత్సరంలో ఉన్న విద్యార్థులు అర్హులు అని అటువంటి విద్యార్థులు అందరూ 15వ తేదీన జరగబోయే ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ ని సద్వినియోగపరచుకోవాలని తెలిపారు.
కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ M. ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ బెంగళూరు పట్టణంలోని k12 టెక్నో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే ఉద్యోగం కొరకు శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల SBI colony నందు 2025వ సంవత్సరానికి ముందు డిగ్రీ పూర్తి చేసిన వారితో పాటు ప్రస్తుత ఫైనల్ ఇయర్ లోని విద్యార్థులు కూడా పాల్గొనే అవకాశం కల్పిస్తుందని ఇందులో ఎంపికైన విద్యార్థులు భారతదేశంలోని అన్ని బ్రాంచులలో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని దానికోసం సంవత్సరానికి మూడు లక్షల జీతంతో పాటు 1.5 లక్షల అదనపు ప్రయోజనాలు పొందడానికి అవకాశం కల్పిస్తున్నారని ,ఇందుకోసం విద్యార్థులు వారి విద్యార్హతలు తెలిపే రేజుమే(Resume)తీసుకుని హాజరు కావాలి అని తెలిపారు .
ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ జి. రామకృష్ణారెడ్డి , ప్రిన్సిపల్ కేబీవి సుబ్బయ్య , సీనియర్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ యు వి ఎస్ కుమార్, కె. సంపత్ కుమార్ ఎం. ఇంతియాజ్ పాల్గొన్నారు.