ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
నంద్యాల, ఆగస్టు 13 (ప్రజాన్యూస్) ::
బ్రాహ్మణ కార్పొరేషన్ నుపునరుద్ధరించి బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ ను కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం పట్లబ్రాహ్మణ చైతన్య వేదిక నంద్యాల జిల్లా అధ్యక్షలు కె.పి.వి.సుబ్బారావుఒక పత్రికా ప్రకటనలో హర్షం వెలిబుచ్చారు. కార్పొరేషన్ చైర్మన్ నియామకం చేసినందుకు ముఖ్యమంత్రి చంద్ర బాబుకు కృతఙ్ఞతలు తెలిపారు.2015_2019 మధ్య కాలంలోకార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణులకు జరిగిన మేలు బ్రాహ్మణకుటుoబాలు మరువలేదని,అంతే ఆశతో కార్పొరేషన్ పునరుద్ధరణ కోసం ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికైనా కార్పొరేషన్ చైర్మన్ నియామకం జరగటంతో బాడీ ఏర్పాటుకు త్వరిత గతంగా పూర్తిచేసి బ్రాహ్మణులకు మేలు జరిగే లాగా చర్యలు
తీసుకోవాలని ఆయనకోరారు.