ప్రజాటివి ప్రతినిధి ప్రభాకర్ చౌదరి
నంద్యాల, ఆగస్టు 08 (ప్రజాన్యూస్) ::
ఆళ్లగడ్డ పట్టణంలోని ఆవుల పుల్లారెడ్డి సేవాసమితి యోగా హాల్ నందు ఈనెల 10వ తేదీ ఆదివారం నాడు నంద్యాల జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లు నంద్యాల జిల్లా యోగ అసోసియేషన్ ఛైర్మెన్ ,విభారే పత్రికాదిపతి ఆవుల విజయ భాస్కరెడ్డి తెలిపారు. యోగ సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ బాల బాలికల మరియు స్త్రీ పురుషుల విభాగంలో యోగ ఎంపిక పోటీలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని, ఈ యోగా ఎంపిక పోటీలకు హాజరు అయ్యే క్రీడాకారులు ఆధార్ కార్డు జిరాక్స్, స్కూల్ బోనఫైడ్ సర్టిఫికెట్ మరియు పాస్ పోర్ట్ సైజు ఫోటోలతో రావాలని ఆయన కోరారు… ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు, నంద్యాల జిల్లా జట్టుకు ప్రాతినిద్యం వహిస్తారని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు 9440826259, 9866136324 మొబైల్ నెంబర్ లను సంప్రదించాలని ఆయన కోరారు..