ఆళ్లగడ్డ పట్టణంలోని హుస్సేన్ రెడ్డి వీదిలో చోరీ కేసులో నలుగురు ముద్దాయిలు అరెస్ట్ చేశామన్ సిఐ యుగందర్

ప్రజాటివి ప్రతినిది ఖాసింవలి

ఆళ్లగడ్డ,09ఆగష్టు 2025(ప్రజాన్యూస్)

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని హుస్సేన్ రెడ్డి వీధిలో ఈనెల 2 న జరిగిన చోరీ కేసులో ముద్దాయిలను అరెస్టు చేసినట్లు టౌన్ సి.ఐ యుగంధర్ తెలిపారు.


టౌన్ పోలీస్ స్టేషన్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బండల వ్యాపారం చేసుకుని జీవిస్తున్న సంజీవ రాయుడు అనే వ్యక్తి ఈనెల 2వ తేదీ శనివారం రాత్రి తన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో పాటు చర్చీలో ప్రార్థన కోసం వెళ్లిన సమయంలో ముద్దాయిలు ఇంటి తాళాలు పగలగొట్టి రూ. 1లక్ష 27వేల ఐదువందల నగదు, మూడు తులాల బంగారు నగలను చోరీ చేసినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి టౌన్ ఎస్ఐ జయప్ప, పోలీస్ సిబ్బంది గట్టి నిఘా ఏర్పాటు చేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కేవలం వారం రోజుల లోపే కేసును చేదించినట్లు ఆయన తెలిపారు. ముద్దాయిలు సంతోష్ , విజయ భాస్కర్, నాగేంద్ర, వరలక్ష్మి అనే వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీఐ యుగంధర్ తెలిపారు. వారిని అరెస్టు చేసి, చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని,. ముద్దాయిలను రిమాండ్కు పంపించినట్లు ఆయన తెలిపారు… చోరీ జరిగిన వారంలోపే కేసును ఛేదించిన సీఐ యుగంధర్, ఎస్సై జయప్ప, కానిస్టేబుల్ రఫీ, అక్బర్, హోంగార్డు శేఖర్ లను జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, ఆళ్లగడ్డ డిఎస్పి ప్రమోద్ అభినందించారు.మీడియా సమావేశంలో ఎస్సై జయప్ప, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *