నంద్యాల,ఆగస్ఘు5(ప్రజాన్యూస్)
✤మాజీ ఎంఎల్ఎ శిల్పారవి ఆరోపణల్లో వాస్తవంలేదు..
✤యూరియా సరపరాపై అదికారులతో మంత్రి నిరంతరం సమీక్ష
✤రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు
నంద్యాలజిల్లాలో మంత్రి ఎన్ ఎండి పరూఖ్ చొరవతో యూరియా కొరతలేదని నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు పేర్కొన్నారు..మంగళవారం స్థానిక టెక్కె మార్కెట్ యార్డు కార్యాలయంలో గోస్పాడు మండలం సొసైటీ అద్యక్షులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు..ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈయేడాది ఖరీప్ ప్రారంభంలోనే సకాలంలో వర్షాలు కురియడం,సాగునీటిని సకాలంలో విడుదల చేయడంతో రైతులు ఆనందంగా మే,జూన్ నెలలో వ్యవసాయపనులు ఆరంభించారని,నందికొట్కూరు,ఆత్మకూరు,ఆళ్లగడ్డ ప్రాంతాలలో మొక్కజొన్న,సోయాబీన్, మినుము సాగు విస్థీర్ణంపెరిగిందన్నారు..గత యేడాదికంటే 55వేల హెక్టార్లలో సాగు విస్థీర్ణం పెరిగిందని,వరి పంట కూడా గతంకంటే ఎక్కువ సాగు చేసే అవకాశాలున్నాయని అదికారులు అంచనాలు వేశారన్నారు..జిల్లా రైతులకు ఖరీప్ సీజనులో 44,778 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించారని, జూలైవరకు 18వేల 293 మెట్రిక్ టన్నులు అవసరంకాగా నేటికి 17,561 మెట్రిక్ టన్నుల యూరియా అదికారులు రైతులకు అందించారన్నారు..జిల్లాలోని రైతులకు సకాలంలో ఆర్ బికె, పిఎసియస్, డిసిఎం ఎస్ ప్రయివేటు డీలర్ల ద్వారా యూరియా అందిస్తున్నామన్నారు…రైతులు వాడవలసిన మోతాదుకంటే పంటకు ఎక్కువగా యూరియా వాడటం, యూరియాదొరకదేమోనని ఆందోళనతో ఎక్కువ యూరియా కొనుగోలుచేసి నిల్వలు ఉంచడం వల్ల ఈయేడాది యూరియా అవసరం పెరిగిందన్నారు..ఈవిషయం దృస్టిలో పెట్టుకుని న్యాయశాఖామంత్రి పరూఖ్ వ్యవసాయశాఖామంత్రితో మాట్లాడి జిల్లాకు యూరియా కేటాయింపులు పెంచేందుకు కృషిచేశారన్నారు..వాస్తవాలు ఇలా ఉంటే మాజీ ఎంఎల్ఎ శిల్పారవిచంద్రకిషోర్ రెడ్డి అసత్య ఆరోపణలుచేస్తూ రైతులను తప్పుదోవపట్టిస్తున్నారని గుంటుపల్లి ఆరోపించారు..గతంలో సండే ఎంఎల్ఎ గాపేరుపొందిన మాజీ ఎంఎల్ఎ శిల్పా మూడునెలలకు,ఆరునెలలకు ఒకసారి నంద్యాలకు వచ్చినాలుగురాళ్లు వేసి రైతులను రెచ్చగొట్టి, ప్రతిగ్రామ లీడర్లపై ఆరోపణలుచేస్తూ దుష్రచారంచేస్తున్నారన్నారు. ప్రభుత్వంపై, టిడిపి నేతలపై మాజీ ఎంఎల్ ఎ బురద చల్లడం తగదని ఆయన హితవు పలికారు..సమావేశంలో గోస్పాడు మండలంలోని సొసైటీ అద్యక్షులు, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్, కమిటీ మెంబర్లు పాల్గొన్నారు..