ప్రజాటివి ప్రతినిది ఖాసింవలి
ఆళ్లగడ్డ,జూలై 31 2025(ప్రజాన్యూస్)
రైతులకు నాణ్యమైన ఎరువులను అందించడమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈవో కే. నరసింహారావు తెలిపారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో గురువారం శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఒకటైన పుష్కళ్ అగ్రిటె క్ లిమిటెడ్ రిటైల్ అవుట్లెట్ ను ఆళ్లగడ్డ పట్టణంలో ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గత 29 సంవత్సరాలుగా రైతులకు నాణ్యమైన సేంద్రియ జీవన ఎరువులు, ఆగ్రో కెమికల్స్ వంటి మంచి ఉత్పత్తులను రైతులకు అందిస్తూ రైతుల యొక్క పురోగతికి, ఆర్థిక అభివృద్ధికి పాటుపడుతున్నదని ఆయన తెలిపారు. ఆళ్లగడ్డ ప్రాంతంలో రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు స్థానికంగా పుష్కల అగ్రిటెక్ అవుట్ లెట్ ను ప్రారంభించడం జరిగింద న్నారు. పుష్కల్ అగ్రిటెక్ వైస్ ప్రెసిడెంట్ జెఎల్ శర్మ మాట్లాడుతూ
రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై తమ సిబ్బంది అవగాహన కల్పించి రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని తెలిపారు. స్టోర్స్ రీజనల్ మేనేజర్ రవీంద్ర శెట్టి మాట్లాడుతూ పుష్కల అగ్రిటెక్ సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారని వివరించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో కంపెనీ ఆళ్లగడ్డ స్టోర్స్ మేనేజర్ సురేష్ బాబు, డిప్యూటీ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్, కృష్ణమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.