ప్రజాటివి ప్రతినిది ఖాసింవలి
ఆళ్లగడ్డ,03జూన్ 2025(ప్రజాన్యూస్)
నంద్యాలజిల్లాలోని ప్రముఖపక్షవాత నివారణ వైద్య కేంద్రం ఉమాపతినగర్ గుండుపాపల రోడ్డు శిదిలావస్తకు చేరుకుంది..నిత్యం వేలాది మంది రోగులు వెళ్లే ఈ రహదారి గుంతలు కూడా పూడ్చకపోవడంతో ప్రజలు రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు..
నంద్యాలజిల్లాలోని దొర్నిపాడు మండలం ఉమాపతినగర్ పక్షవాత వైద్యానికి పెట్టిందిపేరు..నిత్యం పొరుగురాష్ట్రాలనుండి ఇక్కడకు వందలాదిమంది వైద్యంకోసం వస్తుంటారు..అయితే ఈగ్రామానికి వెళ్లే గుండుపాపల ఉమాపతినగర్ రోడ్డు దాదాపు రెండు మూడుకిలోమీటర్ల మేర గుంతలమయంగా మారడంతో వాహనాలరాకపోకలకు ఇబ్బందిగా మారింది,.పైగా ఈ రహదారిలో పక్షవాతం వచ్చిన రోగులను ఆసుపత్రికి తరలించాలంటే ఈగుంతల్లో వాహనాల ప్రయాణం నరకయాతనగా మారింది..కూటమి ప్రభుత్వం అదికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు పూడ్చడంతో పాటు కొత్తరోడ్ల నిర్మాణం జరుగుతున్నప్పటికి జిల్లాలో రోడ్లు భవనాల శాఖ మంత్రితో పాటు మరో మంత్రి ఇరువురు ఉన్నా కూడా అత్యంత కీలకమైన రోడ్ల గుంతలు కూడా పూడ్చకపోవడమేమిటని ఈ ప్రాంతానికి వస్తున్న దూరప్రాంత వాసులు ప్రశ్నిస్తున్నారు..ఇప్పటికైనా నంద్యాల జిల్లాలోని మంత్రులు జోక్యంచేసుకుని గుండుపాపల ఉమాపతినగరం రోడ్డుకు మరమ్మత్తులు లేదా కొత్త రోడ్డు నిర్మించాలని పక్షవాత రోగులతో పాటు గ్రామస్థులు కోరుతున్నారు..