ప్రజాటివి ప్రతినిది ఖాసింవలి
ఆళ్లగడ్డ,4మే 2025(ప్రజాన్యూస్)
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పి.నాగిరెడ్డిపల్లి గ్రామంలో శనివారం రాత్రి టౌన్ సిఐ యుగంధర్ , పోలీస్ సిబ్బంది గ్రామసభను నిర్వహించి ప్రజలకు సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించారు. సీఐ యుగంధర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రహదారి నియమాలను పాటించాలని హెల్మెట్లు ధరించి వాహనాలు నడపాలని సూచించారు. మహిళల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్ గురించి వివరించారు. ఈ సమావేశంలో టౌన్ ఎస్ఐ షేక్ నగీనా, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.