ప్రజాటివి ప్రతినిది ఖాసింవలి
ఆళ్లగడ్డ,ఏప్రియల్ 23(ప్రజాన్యూస్)
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో బుధవారం వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శాంతియుత నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. ఆళ్లగడ్డ తాలూకా జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీరువాల భాష ఆధ్వర్యంలో స్థానిక నాలుగు రోడ్ల కూడలి నుండి మండల రెవెన్యూ కార్యాలయం వరకు ముస్లిం సోదరులు, జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా కన్వీనర్ బీరువాల భాష మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ చట్టం వల్ల కలిగే అనర్థాలను ఆయన వివరించారు. రాజకీయ పార్టీలు కుల సంఘాలు లౌకికవాదులు అంతా ఏకమై ఈ బిల్లును వ్యతిరేకించాలని భాష పేర్కొన్నారు. అనంతరం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మండల తాసిల్దార్ జ్యోతి రత్నకుమారికి తమ సమస్యను ప్రభుత్వానికి నివేదించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో అన్ని మండలాల ముస్లిం నాయకులు చాగలమర్రి మండల వైసీపీ నాయకులు షేక్ బాబూలాల్, తదితరులు పాల్గొన్నారు.