ప్రజాటివి ప్రతినిది ఖాసింవలి
ఆళ్లగడ్డ,ఏప్రియల్ 23(ప్రజాన్యూస్)
నంద్యాల జిల్లా రుద్రవరంలోని ఆలమూరు గ్రామంలో మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పర్యటించారు. ఇటీవల వీచిన పెను గాలుల ధాటికి 80 ఎకరాలకు పైగా నే బొప్పాయి పంట పూర్తిగా దెబ్బతిన్న విషయాన్ని తెలుసుకున్న ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ,ఉద్యాన వన శాఖ, వ్యవసాయ అధికారులతో పాటు ఆలమూరు గ్రామానికి చేరుకొని నేలమట్టమైన బొప్పాయి పంటను పరిశీలించారు.
ఈసందర్బంగా బొప్పాయి సాగు రైతులతో ఎంఎల్ ఎ మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక్కొక్క ఎకరాకు సుమారు లక్ష కు పైగా నే నష్టం వాటిల్లిందని రైతు లు ఎమ్మెల్యేతో ఆవేదన వ్యక్తం చేశారు. రైతులెవరూ కూడా అధైర్య పడకుండా ఉండాలని , ప్రభుత్వం అన్నీ విధాలుగా అండగా ఉంటుందని నష్ట పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటానని ఈసందర్బంగా ఎంఎల్ ఎ హామీ ఇచ్చారు. నష్టపోయిన పంట వివరాలను సేకరించి రైతుకు నష్ట పరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని , వ్యవసాయ అధికారులను ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఆదేశించారు.