నంద్యాల మార్కెట్ యార్డు కార్యాలయంలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

ప్రజాటివి ప్రతినిది ప్రబాకర్ చౌడరి

నంద్యాల,ఏప్రియల్ 20(ప్రజాన్యూస్)

నంద్యాల పట్టణంలోని మార్కెట్ యార్డ్ కార్యాలయంలో టీడిపి సీనియర్ నాయకుడు మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు,ఉర్దూ అకాడమి డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్  అస్ముద్దీన్ మరియు నూతన మార్కెట్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నవ్యాంద్ర  నిర్మాత,అభివృద్ధికి చిరునామా,అమరావతి రూప శిల్పి,అకుంఠిత దీక్షకు మారుపేరైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి,టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు 75 వ పుట్టిన రోజు వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు..!!అనంతరం  నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి.హరిబాబు మరియు ఉర్దూ అకాడమి డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ అస్ముద్దీన్ తో కలసి నూతన మార్కెట్ కమిటీ డైరెక్టర్ ల సమావేశం నిర్వహించారు..!!

ఈ సందర్భంగా గుంటుపల్లి హరిబాబు మాట్లాడుతూ  ఈ నెల 28 వ తేదీన నంద్యాల నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని,ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రులు  Nmd ఫరూఖ్,బీసీ జనార్దన్ రెడ్డి, నంద్యాల జిల్లాలోని  ఎమ్మెల్యేలు మరియు రైతులు,రైతు సంఘాల నాయకులు,టిడిపి నేతలు,కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి లాయర్ బాబు,గిరిజన నాయకుడు డుమావత్.స్వామి నాయక్ తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *