నంద్యాల మండలం చాబోలులో ఘనంగా చంద్రబాబు జన్మదినవేడుకలు

ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి

నంద్యాల,ఏప్రియల్ 20( ప్రజాన్యూస్)

నంద్యాల మండలం చాబోలు గ్రామంలో నంద్యాల మండల టిడిపి ప్రధాన కార్యదర్శి మండ్ల గుర్రప్ప ఆద్వర్యంలో రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్ర బాబు 75 వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు..ఈ సందర్బంగా  కేక్ కట్ చేసి,స్వీట్లు పంచి, ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు..

.ఈ సందర్భంగా మండల టీడిపి ప్రధాన కార్యదర్శి మండ్ల గుర్రప్ప మాట్లాడుతూ..రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఫరూఖ్ ఆదేశాల మేరకు చాబోలు గ్రామంలో గ్రామ టీడిపి నాయకులు,కార్యకర్తలు మరియు ఎన్టీఆర్ అభిమానుల ఆద్వర్యంలో రాష్ట్ర నవ నిర్మాత సృష్టి కర్త,అమరావతి రూప శిల్పి నిరంతరం ప్రజా శ్రేయస్సు కొరకు పాటు పడే అలుపెరుగని పోరాట పటిమ గల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగిందన్నారు..!!ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని,నవ్యాంధ్ర ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడుకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించి,రాష్ట్ర ప్రజలకు ఇంకా సేవ చేయడానికి తోడ్పాటునందించాలని కోరారు..!!ఈ కార్యక్రమంలో డి.బాలహుస్సేని,ముల్ల షబ్బీర్,లింగమయ్య,మనోహర్,పెద్దయ్య,విజయ్,చక్రి మరియు గ్రామ పెద్దలు,టిడిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *