ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి
నంద్యాల,ఏప్రియల్ 10 (ప్రజాన్యూస్)
నంద్యాల జీవితభీమా కార్యాలయంలో నూతన ఆర్ధిక సంవత్సర వ్యాపార ప్రారంభానికి దస్త్రపూజ కార్యక్రమం బ్రాంచ్ మేనేజరు శివశంకర్ కుమార్ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు..వేదపండితులతో పూజాది కార్యక్రమాలను నిర్వహించారు.
అనంతరం బ్రాంచి మేనేజరుమాట్లాడుతూ గత ఆర్ధిక సంవత్సరంలో నంద్యాల ఎల్ ఐ సి బ్రాంచి అన్ని విభాగాల్లో ఉత్తమ పలితాలను కనబరిచిందన్నారు..మార్చినెలలో నూతన వ్యాపారంలో అద్బుత పలితం కనబరుస్తూ 50 లక్షల ప్రీమియం తీసుకుని వచ్చి సతీసమేతంగా ఆసియా పారిన్ టూర్ కు అర్హత సాదించిన సద్దల నాగరాజు, ఆడిటర్, గెలాక్సీ క్లబ్ మెంబరు ను ఈసందర్బంగా ఘనంగా అభినందించారు..ఈయేడాది కూడా అద్బుత ప్రదర్శన కనబరచాలని ఈసందర్బంగా ఆయన ఎజెంట్లను కోరారు..ఈకార్యక్రమంలో బ్రాంచ్ మేనేజరు శివశంకర్ కుమార్ ,ఎబియం, ఆపీసు సిబ్బంది, డెవలప్ మెంటు అదికారులు, CLIAS మరియు ఏజంట్లు పాల్గొన్నారు..