బాచేపల్లి గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం కు విశేష స్పందన..

ప్రజాటివి ప్రతినిది ఖాసిం వలి

ఆళ్లగడ్డ,ఏప్రియల్ 14 (ప్రజాన్యూస్)

ఆళ్లగడ్డ మండలంలోని బాచేపల్లి గ్రామంలోని శ్రీ కృష్ణ స్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, స్వాతి వైద్యశాల ఆధ్వర్యంలో ఆళ్లగడ్డకు చెందిన డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి మెమోరియల్ హాస్పిటల్ సౌజన్యంతో స్పెషలిస్ట్ డాక్టర్ల బృందం రోగులను పరీక్షించి ఉచితంగా మందులను అందజేశారు. ప్రముఖ డయాబెటిక్ స్పెషలిస్ట్ డాక్టర్ యశ్వంత్ రెడ్డి, ఆర్థోవైద్య నిపుణులు డాక్టర్ టి ఎన్. లక్ష్మిరెడ్డి, కంటి వైద్య నిపుణులు డాక్టర్ చంద్రిక, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ అభిలాష్ లు రోగులను పరీక్షించి ఉచితంగా మందులను కూడా అందజేశారు. కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ చంద్రిక కంటి వైద్య సమస్యలు ఉన్నవారికి తమ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించి అద్దాలను కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా స్పెషలిస్ట్ డాక్టర్లు డాక్టర్ లక్ష్మిరెడ్డి, డాక్టర్ యశ్వంత్ రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ ఆళ్లగడ్డ డాక్టర్ వెంకటసుబ్బారెడ్డి హాస్పిటల్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోనిఅన్ని మండలాలలోని పలు గ్రామాలలో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు 13 గ్రామాలలో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని రోగులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హర్షిత, ఫార్మాసిస్టు మధుసూదన్ , వైద్య సిబ్బంది రవి, బాచేపల్లి తండా కృష్ణానాయక్, ఆఫ్తాల్ మీకు అసిస్టెంట్ అజయ్ నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *