ప్రజాటివి ప్రతినిది ఖాసింవలి
ఆళ్లగడ్డ,ఏప్రియల్ 07( ప్రజాన్యూస్)
ఆళ్లగడ్డ పట్టణంలో శాంతిభద్రతలను కాపాడేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఆళ్లగడ్డ టౌన్ సి.ఐ . యుగంధర్ తెలిపారు. ఆళ్లగడ్డ అర్బన్ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా సోమవారం సిఐ యుగంధర్ పదవి బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు తాను ఆళ్లగడ్డ టౌన్ సిఐగా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలో శాంతిభద్రతల సంరక్షణకు తమ వంతు కృషి చేస్తామని ఆయన తెలిపారు. అసాంఘిక కార్యకలాపాల పట్ల ఉక్కు పాదం మోపుతామని తెలిపారు.ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకొని రావాలని సీ ఐ యుగంధర్ వివరించారు.
నూతన సీఐ కి సిబ్బంది స్వాగతం..
ఆళ్లగడ్డ టౌన్ సిఐగా కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి బదలిపై వచ్చిన యుగంధర్ సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆళ్లగడ్డ టౌన్ ఎస్ఐలు షేక్ నగీన, జయప్ప, పోలీస్ సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.