నంద్యాల 17 వ మార్కెట్ యార్డు చైర్మన్ గా గుంటుపల్లి హరిబాబు..20ఏళ్లకు కమ్మసామాజికవర్గానికి దక్కిన పదవి

ప్రజాటివి ప్రతినిది మూల్పూరి ప్రభాకర్ చౌదరి

నంద్యాల,మార్చి 28( ప్రజాన్యూస్)

నంద్యాల మార్కెట్ యార్డు 17 వచైర్మన్ గా నంద్యాల మండలం రైతునగరం గ్రామానికి చెందిన టిడిపి నేత రాష్ట్ర తెలుగురైతుసంఘ ఉపాద్యక్షుడు గుంటుపల్లి హరిబాబును నియమిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్వర్వులు జారీచేసింది..దశాబ్దాలకాలంగా ఆయన తండ్రి కిశే గుంటుపల్లి వెంకటేశ్వర్లు రైతునగరం గ్రామసర్పంచ్ తోపాటు పలు పదువులను నిర్వహించారు..టిడిపి పార్టీ ఏర్పడినప్పటినుండి పార్టీకి గుంటుపల్లి వెంకటేశ్వర్లు సేవలు చేశారు..తండ్రి బాటలోనే కుమారుడు గుంటుపల్లి హరిబాబు టిడిపి పార్టీనే నమ్ముకుని గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పడ్డా ఎదురోడ్డి పార్టీకి పనిచేశారు..ఓ వైపు తెలుగు రైతు రాష్ట్ర పదవిలో ఉండి పార్టీకి సేవలు చేస్తూ యువగళం పాదయాత్రలో యువనేత నారాలోకోష్ వెంట రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు..గత ఎన్నికలలో మార్కాపురం ఎన్నికల పరిశీలకులుగా పనిచేశారు..2024 నంద్యాల నియోజకవర్గం ఎన్నికలలో టిడిపి అబ్యర్ధి ఎన్ ఎండి పరూఖ్ గెలుపుకు తన వంతు కృషిచేశారు..అదిష్టానంతో పాటు స్థానికంగా వినయం,విదేయత నిబద్తత తో పార్టీకి సేవలు చేసి మెప్పు పొందారు గుంటుపల్లి హరిబాబు.. నంద్యాల 17 వ మార్కెటు యార్డుచైర్మన్ గా బాద్యతలు తీసుకోనున్నారు.కాగా 55 ఏళ్లు చరిత్రకలిగిన నంద్యాల యార్కెటు యార్డులో ఇప్పటివరకు1970 లో మొదటిసారిగా  ఆర్ రామలింగారెడ్డి,  వై వెంకటయ్య, టి వీరయ్య,రామచంద్రారెడ్డి, ఎంసి బోగిరెడ్డి, నంద్యాల వీరారెడ్డి, కె శివనాగిరెడ్డి ,వెంకటనారాయణ చౌదరి, వై పురుషోత్తంరెడ్డి, ఎం విజయశేఖరరెడ్డి, సిద్దం శివరాం(రెండు సార్లు), ఇసాక్ బాష(రెండుసార్లు),మేడా లక్షమయ్య,చివరగా  పోలూరి మహేశ్వరరెడ్డిలు మార్కెట్ యార్డు చైర్మన్లగా పనిచేశారు..వీరిలో కమ్మ సామాజికవర్గానికి చెందిన వెంకటనారాయణ చౌదరి 14.05.2001 నుండి 13.05.2004 వరకు చైర్మన్ గా పనిచేశారు..సరిగ్గా 20 ఏళ్లకు కమ్మసామాజిక వర్గానికిచెందిన గుంటుపల్లి హరిబాబు చైర్మన్ కావడంతో ఉమ్మడి కర్నూలు జిల్లా లోని కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *