ప్రజాటివి ప్రతినిది ప్రభాకర్ చౌదరి
నంద్యాల,మార్చి 24( ప్రజాన్యూస్)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినన ప్రజాసమస్యల పరిష్కారవేదిక ద్వారా అందిన ప్రజలు పిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిష్కారం చేయాలని నంద్యాల సబ్ కలెక్టరు చల్లా విశ్వనాద్ అదికారులను ఆదేశించారు..ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నంద్యాల సబ్ కలెక్టరు కార్యాలయంలో సబ్ కలెక్టరు చల్లా విశ్వనాద్ నిర్వహించారు..ఈసందర్బంగా నంద్యాల రెవెన్యూడివజన్ పరిదిలోని పలువురు ప్రజలు తమసమస్యల పిర్యాదులను ఆర్డిఓ కి అందించారు..ఈసందర్బంగా ఆర్డిఓ చల్లా విశ్వనాద్ మాట్లాడుతూ సబ్ కలెక్టరు కార్యాలయంలో నిర్వహించిన పిజిఆర్ ఎస్ కార్యక్రమంలో గోనెగండ్ల, శిరివెళ్ల ప్రాంతాలకు చెందిన రైతులు తమ సమస్యలను విన్నివించారని వారి సమస్యలను ప్రాదాన్యత క్రమంలో త్వరిత గతిన పరిష్కరించేందుకు కృషిచేయాలని తహసిల్దార్లను ఆదేశించామన్నారు..కార్యక్రమంలో రెవెన్యూడివిజన్ పరిదిలోని పలువురు అదికారులు పాల్గొన్నారు..